YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఏప్రిల్‌లో తెలంగాణ సీఎస్ శాంతికుమారి రిటైర్మెంట్..

 ఏప్రిల్‌లో తెలంగాణ సీఎస్ శాంతికుమారి రిటైర్మెంట్..

హైదరాబాద్, ఫిబ్రవరి 12, 
అతిపెద్ద పోస్ట్‌లో ఉన్న లేడీ ఆఫీసర్‌ తీరుతో అధికారులంతా విసిగిపోయారట. తమను పట్టించుకోకపోవడంతో ఇన్నాళ్లూ ఆవేదన పడ్డారట. సమస్యలపై స్పందించకపోయినా సర్దుకుపోయారట. ఉన్నతాధికారులు రిక్వెస్ట్ చేస్తే కూడా ఆ అధికారి అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదట. ఇవన్నీ మనసులో పెట్టుకుని బాధ పడుతున్న అధికారులంతా..ఇప్పుడు ఒక్కసారిగా రిలాక్స్‌ అవుతున్నారట. కారణం త్వరలోనే ఆ పెద్ద ఆఫీసర్‌ రిటైర్ కాబోతున్నారట. ఇంతకీ ఎవరా ఆఫీసర్‌ అంటే సీఎస్ శాంతికుమారి అంటున్నారు.తెలంగాణ మొట్టమొదటి మహిళా సీఎస్‌గా 2023 జనవరిలో పదవీ బాధ్యతలు చేపట్టారు శాంతికుమారి. పాలనాపరంగా బయట పెద్దగా వివాదాలు, విమర్శలు లేకపోయినా..సహచర అధికారుల్లో మాత్రం శాంతికుమారి తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం తర్వాత ప్రభుత్వ పెద్దగా, మిగతా IASల నుంచి మొదలు ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులందరికీ బాస్ స్థానంలో ఉన్న శాంతికుమారి అందుకు తగ్గట్టుగా వ్యవహరించడం లేదని చాలాకాలంగా విమర్శలు ఉన్నాయి. వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఏ మాత్రం పట్టించుకునేవారు కాదని టాక్సెక్రటేరియట్‌లో వివిధ శాఖలకు అధిపతులుగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులతోనూ సీఎస్ శాంతికుమారి సఖ్యతగా ఉండేవారు కాదని తెలుస్తోంది. ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు కూడా సమయం ఇచ్చేవారు కాదని అధికారులు వాపోతున్నారట.కలెక్టర్లు తమ జిల్లాలకు సంబంధించిన అంశాలపై అపాయింట్‌మెంట్ అడిగినా శాంతి కుమారి స్పందించేవారు కాదని అంటున్నారు. ఇక ఐఏఎస్ అధికారులందరికి పెద్దగా ఉన్న శాంతికుమారి వారి సమస్యలు, ఇబ్బందులను ఏ మాత్రం పట్టించుకునేవారు కాదని, దీంతో అధికారులంతా అమె తీరుపై విసిగిపోయారన్న చర్చ జరుగుతోంది.ఇక అధికారులతోనే కాదు మంత్రులతోనూ సీఎం శాంతికుమారి ఇలానే వ్యవహరించేవారన్న టాక్ వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని మినహా మంత్రులను కూడా పెద్దగా పట్టించుకోరట. మంత్రులు, ఐఏఎస్ అధికారుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వివిధ సమస్యలపై సెక్రటేరియట్‌కు వచ్చే విజిటర్స్‌ను సీఎస్ శాంతి కుమారి అస్సలు కలిసేవారు కాదట. గతేడాది నవంబర్‌లో సడెన్‌గా పది రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లారు శాంతి కుమారి.అయినా ఎవ్వరికి ఇంచార్జ్‌ బాధ్యతలు అప్పగించలేదు. దీంతో అప్పుడు ఆమె స్థాయిలో క్లియర్ చేయాల్సిన ఫైళ్లన్ని పెండింగ్‌లో పడిపోయి పాలనపై ప్రభావం పడిందట. ఇలా ప్రభుత్వ అధికారుల్లో ఆమె తీరుపై చాలా అసంతృప్తి వ్యక్తం అవుతుందట. కానీ కక్కలేక మింగలేక అన్నట్లు ఉన్నతాధికారి కాబట్టి లోలోన బాధపడుతూ వస్తున్నారట. అయితే త్వరలోనే ఆమె రిటైర్ కాబోతుండటంతో ఐఏఎస్ అధికారులంతా బిగ్‌ రిలీఫ్‌గా ఫీల్ అవుతున్నారట. కొత్తగా వచ్చే సీఎస్ అయినా తమకు తగిన ప్రాధాన్యత ఇచ్చి, సమస్యలను పట్టించుకోవాలని కోరుకుంటున్నారట సెక్రటేరియట్ ఉద్యోగులు

Related Posts