
ఏలూరు త్రీ టౌన్ స్టేషన్లో చింతమనేని డ్రైవర్ ఫిర్యాదు – ఏలూరు
బుధవారం రాత్రి వట్లురు లో ఒక వివాహానికి హాజరై తిరిగి వస్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కార్ కు ఉద్దేశ్య పూర్వకంగా వైకాపా నేత అబ్బయ్య చౌదరి, అతని అనుచరులు తమ కార్ ను అడ్డు పెట్టీ గొడవను సృష్టించారని ఎమ్మెల్యే డ్రైవర్ పోలీసులకు పిర్యాదు చేసాడు. కారు అడ్డం తీయాలంటూ చింతమనేని డ్రైవర్ కోరాడు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, డ్రైవర్ సుధీర్, గన్ మెన్ రవీంద్ర పై ఐరెన్ రాడ్ తో కర్రలతో దాడి చేసారు.
ఘటన విషయం తెలియడంతో అర్ధరాత్రి వేళలో సైతం దెందులూరు నియోజకవర్గంలోని దాదాపు 80 గ్రామాల నుంచి దుగ్గిరాల క్యాంపు కార్యాలయానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు.