
హైదరాబాద్
తెలంగాణలో ఒక గ్రాడ్యు యేట్ రెండు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు పోటీ చేస్తున్నా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం ఎమ్మెల్సీ ఫైట్‌కు దూరంగా ఉంటోంది. దీంతో కారు పార్టీకి ఏమైంది? ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే చర్చ మొదలైంది.
రేవంత్ ప్రభుత్వం అన్నింట్లో విఫలమైందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యిందని విమర్శిస్తున్న బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నది మాత్రం అంతుచిక్కడం లేదట.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు చాలా కోపంగా ఉన్నారని చెబుతున్నారు గులాబీ బాస్. ఉపఎన్నికలు వస్తే బీఆర్ఎస్‌దే విజయమంటు న్నారు. తాను కొడితే మామూలుగా ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చారు. గులాబీ దళపతి మాటలు విన్న బీఆర్ఎస్ క్యాడర్‌లో ఫుల్ జోష్ కనిపిస్తోంది.
కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటాన్ని మాత్రం కారు పార్టీ నేతలు, క్యాడర్ జీర్ణించు కోలేకపోతున్నార బరిలోకి దిగకపోవడానికి రీజనేంటన్నది పెద్ద క్వశ్చన్? ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అన్న రేంజ్ డైలాగ్స్ చెప్పిన కేసీఆర్
ఎమ్మెల్సీ పోల్స్‌కు ముఖం చాటేయడం పై మాత్రం ఎవరికీ నచ్చడం లేదట. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉత్తర తెలంగాణ కారు పార్టీకి కంచుకోటగా ఉంటోంది. ఇప్పటికీ అంతో ఇంతో పట్టుంది.
అయినా రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్ని కల్లో పోటీ చేయక పోవడానికి రీజనేంటో ఎవరికీ అర్థం కావడం లేదట. ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకునే అవకాశం ఉన్నా బరిలోకి దిగక పోవడానికి రీజనేంటన్నది పెద్ద క్వశ్చన్‌గా మారింది.