YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అప్పుడే సెక్రటేరియెట్ లో లీకులా...

అప్పుడే సెక్రటేరియెట్ లో లీకులా...

హైదరాబాద్, ఫిబ్రవరి 14, 
తెలంగాణ పరిపాలనా యంత్రాంగం మొత్తం కొలువుదీరే రాష్ట్ర సచివాలయం భవనాలు పెచ్చులూడిన ఘటన పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సచివాలయం మూడో అంతస్తు నుంచి ఎదురు వైపున ఉండే డిజైన్ లోని ఓ భాగం ఊడిపోయింది. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర మంత్రులు సచివాలయంలోనే ఉన్నారు. ఈ ఘటనలో సెక్రటేరియట్ పార్కింగ్ స్థలంలో ఉంచిన రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ కారుపై పెచ్చులు పడడంతో.. కారు పై భాగం దెబ్బతింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. నిర్మాణం పూర్తయ్యి రెండేళ్లు కూడా పూర్తవకుండానే ఇలాంటి ఘటనలు జరగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దాంతో.. రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం ఈ ఘటన పై దర్యాప్తు ప్రారంభించారు.దాదాపు రూ.1200 కోట్లతో నిర్మించిన భవనం. దేశంలోనే అత్యంత పేరున్న సంస్థ నిర్మించిందని ప్రచారం. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదంటూ ప్రభుత్వాలు ఊదరగొట్టేశాయి. తీరా.. రెండేళ్లు కూడా గడవక ముందే పెచ్చులూడుతూ.. నిర్మాణంలోని లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో.. ప్రభుత్వ అధికారులతో పాటు పాలకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. తాజాగా పెచ్చులూడిన ఘటన పై సెక్రటేరియట్ బిల్డింగ్ ఇంజనీర్లపై ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం రైలింగ్ పట్టి కూలిపోయి 24 గంటలైనా ఘటనపై అధికారులు నివేదిక ఇవ్వకపోవడంపై సీరియస్ అయ్యారు. 24 గంటల్లోగా తనకు ఈ ఘటన పై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
 గతంలోని బిల్డింగ్ లను పూర్తిగా నేలమట్టం చేసి 28 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నూతన సచివాలయం భవనాన్ని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. 265 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఈ బిల్డింగ్ ను దేశంలోని అత్యంత ఎత్తైన సచివాలయ భవనాల్లో ఒకటిగా గుర్తించారు. 2019 జూన్ 27న అప్పటి సీఎం కేసీఆర్ భూమిపూజ చేసి నిర్మాణాన్ని ప్రారంభించగా.. 2023 ఏప్రిల్ 30న ప్రారంభోత్సవం చేశారు. ఈ బిల్డింగ్ నిర్మాణ బాధ్యతల్ని షాపూర్‌ జీ పల్లోంజీ గ్రూప్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. కాగా.. దీని నిర్మాణం కోసం ఏకంగా రూ.1,200 కోట్లు ఖర్చు చేశారు. ఇంతా చేసిన తర్వాత.. రెండేళ్లు కూడా గడవక ముందే.. బిల్డింగ్ గోడలు చాలా వరకు పగుళ్లు కనిపిస్తున్నాయి. పిల్లర్ల పక్కన పొడవైన చీలికలు కనిపిస్తుండంతో.. బిల్డింగ్ నాణ్యతపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో.. రాష్ట్ర సచివాలయ బిల్డింగ్ నిర్మాణంలో లోపాలు, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని బిల్డింగ్ ఇంజనీర్లకు ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పాలన నిర్వహించే నిర్మాణంలో నాణ్యతా లోపాలపై నిర్మాణ సంస్థ షాపూర్ జీ పలోంజి కంపెనీ ప్రతినిధులపై మంత్రి కోమటి రెడ్డి ఆగ్రహం చేశారు. భవనం రెయిలింగ్ కూలిన విషయంలో సంస్థ తరఫున వివరణ ఇచ్చేందుకు సంస్థ ప్రతినిధులు మంత్రిని కలవగా.. కోమటి రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కేంద్ర స్థానమైన భవనాన్నే ఇలా కడితే మిగతా వాటి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఏది ఏమైనా నాణ్యతా లోపాలు ఉంటే.. సదరు సంస్థ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.
లోపాలను సమీక్షిస్తున్నాం
ఘటనపై షాపూర్ జి పల్లోంజి నిర్మాణ సంస్థ స్పందించింది. రెగ్యులర్ డిపార్ట్‌మెంట్ వర్క్‌లో భాగంగా కేబుల్, లైటింగ్ కోసం పనులు చేస్తున్నారని వివరించింది. ఇది నిర్మాణ లోపం వల్ల జరిగింది కాదని స్పష్టం చేసింది. ఈడి పడింది కాంక్రీట్ వర్క్ కాదు.. స్ట్రక్చర్‌కు ఎలాంటి ప్రాబ్లం లేదని వివరించింది. ఊడి పడింది జీఆర్సీ ఫ్రేమ్ అని నిర్మాణ సంస్థ స్పష్టం చేసిందిఇటీవల లైటింగ్ కోసం, కొత్త కేబుల్స్ కోసం జీఆర్సీ డ్రిల్ చేస్తున్నారని పల్లోంజి సంస్థ వివరించింది. డ్రిల్ చేస్తే జీఆర్సీ డ్యామేజ్ అవుతుందని తెలిపింది. స్ట్రక్చర్ నిర్మాణం పూర్తయి రెండేళ్లు అవుతుందని.. ఎలాంటి నాణ్యత లోపం లేదని వెల్లడించింది. అయినా ఈ ఘటనపై తాను రివ్యూ చేస్తున్నామని.. ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.ఈ సచివాలయాన్ని గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అయితే.. సచివాలయ నిర్మాణంలో పలు సమస్యలు ఉన్నట్లు ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. సచివాలయం నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. తన ఛాంబర్‌తో పాటు టాయ్‌లెట్స్‌లోనూ శబ్ధాలు వస్తున్నాయని.. అప్పట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులకు చెప్పారు

Related Posts