
విజయవాడ, ఫిబ్రవరి 15,
చంద్రబాబు పాలన మోసాలను అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని జగన్మోహన్ రెడ్డి తాను సమావేశం అయ్యే..తనతో సమవేశం అయ్యే వైసీపీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అందరూ ప్రజల్లోనే ఉండాలని చెబుతున్నారు. అయితే జగన్ మాత్రం ప్రకటించిన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేందుకు సిద్ధంగా లేరు. కొద్ది రోజుల కిందట జగన్ “ కార్యకర్తలతో జగనన్న - భవిష్యత్ కు దిశానిర్దేశం” పేరుతో కార్యక్రమాన్ని ప్రకటించారు. సంక్రాంతి అయిపోగానే కార్యకర్తల వద్దకు వస్తానని చెప్పారు. అందర్నీ కలుస్తానని వివరించారు. జగన్ చెప్పిన తీరుతో కార్యకర్తలు చాలా మంది ఆయన నిజంగానే వస్తారనుకున్నారు. కానీ జగన్ ఇప్పుడు ఫిబ్రవరి వచ్చినా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. పార్టీని పునర్ నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో జగన్.. జిల్లాల అధ్యక్షుల్ని నియమించే ప్రయత్నం చేశారు. అయితే నియమితులైన చాలా మంది అట్టరహాసంగా ప్రమాణం చేశారు కానీ ఎవరూ యాక్టివ్ గా లేరు. కింది స్థాయి వరకూ పార్టీని నిర్మాణం చేయాలని జగన్ అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకూ ఓ లేయర్ లో కూడా పార్టీ నాయకత్వాన్ని సిద్ధం చేయలేదు. అదే సమయంలో సిక్కోలు నుంచి చిత్తూరు వరకూ చాలా మంది సీనియర్ నేతలు సైలెంట్ గా ఉన్నారు. వారు సహకరించకపోతే కార్యకర్తలతో సమావేశాలు ఫెయిలయ్యే ప్రమాదం ఉంది. వైఎస్ జగన్ పులివెందుల నియోజకవర్గానికి వెళ్లినప్పుడు కార్యకర్తలను కలవడానికే తంటాలు పడుతున్నారు. వచ్చిన వారంతా బిల్లులు సారూ అంటున్నారు.కోట్లు ఖర్చు పెట్టి పనులు చేశారు కానీ ఇప్పుడు బిల్లులు రావడం లేదు. మరో వైపు పార్టీని నమ్ముకుని బెట్టింగులు కాసి నష్టోయామని ఆదుకోవాలని చాలా మంది అడుగుతున్నారు. వీరు ప్రతి నియోజకవర్గంలోనూ ఉంటారని ఇలాంటి వారు చేసే అలజడితో మీడియా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని అతి పార్టీకి మరింత డ్యామేజీ చేస్తుందన్న ఉద్దేసంతో జగన్ ఆగిపోయారని అంటున్నారు. జగన్ ఎంతో కొంత సాయం చేస్తారని కార్యకర్తల నుంచి ఇఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. వాటిని తగ్గించిన తర్వాత జగన్ జనంలోకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారని అంటున్నారు . అధికారం వచ్చిన ఐదేళ్లలో జగన్ కార్యకర్తలను పట్టించుకోలేదని ఇటీవల అంగీకరిస్తున్నారు. జగన్ 2.0లో కార్యకర్తల కేసమే పని చేస్తానంటున్నారు. అయితే ఈ ప్రకటనకు అంత కదలిక లేదని వైసీపీ వర్గాలు అంచనాకు వచ్చాయి. మరో వైపు ప్రభుత్వంపై ఎంతో కొంత అసంతృప్తి ప్రజల్లో ప్రారంభమైతే.. జగన్ పర్యటనలకు స్పందన కనిపిస్తుందని భావిస్తున్నారు. అయితే జగన్ పాలనపైనే ఇప్పటికే విస్తృత ప్రచారం జరుగుతూండటంతో వైసీపీ నేతలు కూడా మండిపడుతున్నారు. వైసీపీ పాలనలో ఏదో జరిగిందని కూటమి ప్రభుత్వం నమ్మించే ప్రయత్నం చేస్తోందని ..దాన్ని తిప్పికొట్టాలని జగన్ పార్టీ నేతలకు అంటున్నారు. అంటే ప్రజలు ఇంకా కూటమి చెప్పేదే వింటున్నారి.. ఆ పరిస్థితి మారే వరకూ ఎదురుచూడటం మంచిదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా జగన్ కార్యకర్తల్లోకి వెళ్లే అంశంపైనా ముందూ వెనుకాడుతున్నారు.