YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పులివెందుల లో పాగా సాధ్యమేనా

పులివెందుల లో పాగా సాధ్యమేనా

కడప, ఫిబ్రవరి 15, 
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లుగా..జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల మీదే ఫోకస్ పెట్టిందట టీడీపీ. గతేడాది జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయలసీమలో యాక్టివిటీ బాగా పెంచింది సైకిల్ పార్టీ. ఓవైపు టీడీపీ, మరోవైపు జనసేన..జగన్ కంచుకోటను బద్దలు కొట్టాలని ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు జగన్ సొంత ఇలాఖగా చెప్పుకునే పులివెందులలో టీడీపీ ఆపరేషన్ ఊపందుకుందిరాయలసీమ నాలుగు జిల్లాల పరిస్థితి ఎలా ఉన్నా..పులివెందుల రాజకీయం మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. వార్ వన్ సైడే అన్నట్లుగా..పులివెందుల నియోజకవర్గంలో ఏ ఎన్నిక జరిగినా అప్పుడు కాంగ్రెస్కు..తర్వాత వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటివరకు టీడీపీ ఏ ఎన్నికల్లో కూడా పులివెందులలో తమ ప్రభావం చూపలేకపోయింది. పులివెందుల మున్సిపాలిటీలో ఇతర పార్టీల అభ్యర్థులు పోటీ చేయడమే అతికష్టమంటే.. గెలుపు అనేది ఊహలకు కూడా అందకపోయేది. అలా జగన్ కుటుంబం పులివెందులలో ఆధిపత్యం చలాయిస్తూ వస్తోంది.కూటమి ప్రభుత్వం వచ్చాక పులివెందులలో తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ముందుకు పులివెందుల మున్సిపల్ పీఠంపై ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో 33 కౌన్సిల్ సీట్లను క్లీన్‌స్వీప్‌ చేసి వైసీపీనే మున్సిపల్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుంది. ఇప్పుడు పసుపు దళం రచిస్తున్న ప్లాన్‌తో వైసీపీ కంచుకోటలో లీడర్లు ఫ్యాన్ స్విచ్చాప్ చేసి అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఈ దెబ్బతో వైసీపీ అయోమయంలో పడుతోంది.ఇప్పుడు ఇద్దరే రాబోయే రోజుల్లో ఎందరో..ఈ డైలాగ్ ఇప్పుడు ఫ్యాన్ పార్టీని కలవరపెడుతోందట. ఓ కౌన్సిలర్ రాజీనామా చేయగా..ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లను చేర్చుకుంది టీడీపీ. మరో ఎనిమిది మంది వైసీపీ కౌన్సిలర్లు కూడా తమతో టచ్లో ఉన్నారని చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ టికెట్లు ఇస్తామని భరోసా ఇచ్చి మరీ కౌన్సిలర్లను చేర్చుకుంటుందట టీడీపీ. ప్రస్తుత పొలిటికల్ డెవలప్మెంట్స్ చూస్తుంటే పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ పీఠంపై టీడీపీ సీరియస్గానే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.పులివెందులలో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో 32 స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది. ఆ నియోజకవర్గంలో టీడీపీకి ఇది అతి పెద్ద చారిత్రాత్మక విజయం. టీడీపీ ఒకటి రెండు సీట్లు గెలిస్తే మహా గొప్ప అన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు వార్ వన్ సైడ్ అన్నట్లుగా నీటి సంఘాల ఎన్నికల్లో సత్తా చాటిందిఆ ఫలితాల తర్వాత మంచి ఉపుమీదున్న టీడీపీ.. పులివెందుల మున్సిపాలిటీ పీఠం కోసం ఆపరేషన్ స్పీడప్ చేసింది. దాంతో కంచుకోటను కాపాడుకోవడానికి జగన్ ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. సొంత ఇలాఖలో మున్సిపల్ పీఠం వదులుకుంటే చాలా నియోజకవర్గాలపై ఇదే ప్రభావం పడే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం మీద ఫోకస్ చేశారు జగన్. అక్కడ లోకల్ బాడీస్తో పాటు మున్సిపాలిటీల్లో పాగా వేసే ప్రయత్నం చేశారు. భరత్ అనే వైసీపీ నేతను ఎమ్మెల్సీ చేసి ఏకంగా చంద్రబాబును ఓడించేందుకు మాస్టర్ స్కెచ్ వేసి ఫెయిల్ అయింది ఫ్యాన్ పార్టీ అధిష్టానం. అయితే అప్పుడు జగన్ ఫాలో అయిన ప్లాన్నే ఇప్పుడు టీడీపీ ఇంప్లిమెంట్ చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. జగన్ కుప్పం మీద కాన్సంట్రేట్ చేస్తే..టీడీపీ పులివెందుల నియోజకవర్గంలో గేమ్ స్టార్ట్ చేసిందంటున్నారు.వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ నుంచి బలమైన అభ్యర్థిని పెట్టి..జగన్కు టఫ్ ఫైట్ ఇవ్వాలనుకుంటోందట టీడీపీ. గెలుపోటములు పక్కన పెడితే వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఉండొద్దని వ్యూహాలు రచిస్తోందట. అందుకే బలమైన వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకోవడానికి లోకల్ లీడర్లతో ఆపరేషన్ చేయిస్తోంది. స్థానిక పరిస్థితులపై టీడీపీ అధిష్టానం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోందట. అందులో భాగంగానే జగన్కు సన్నిహితులుగా, వైసీపీ బలమైన నేతలుగా ఉన్నవారిని లైన్లో పెట్టి..వరుసగా కండువాలు కప్పే ప్లాన్ చేస్తోందట టీడీపీ.టీడీపీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పులివెందులలో రాజకీయంగా ఎలాంటి పైచేయి సాధించలేకపోయింది. ఆ లోటును ఈ టర్మ్లో తీర్చుకోవాలని భావిస్తోందట సైకిల్ పార్టీ. జగన్ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టి..పులివెందులలో టీడీపీ జెండా రెపరెపలాడించాలని ఫిక్స్ అయిందట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమలోని 52 సీట్లలో కేవలం ఏడు సీట్లు మాత్రమే గెలుచుకుంది వైసీపీ.వైఎస్సార్‌ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లకు గాను కూటమికి 7 సీట్లు వస్తే వైసీపీ స్థానాలతోనే సరిపెట్టుకుంది. అప్పటి నుంచి రాయలసీమ నాలుగు జిల్లాలపై స్పెషల్ కాన్సంట్రేషన్ పెట్టింది కూటమి సర్కార్. ప్రత్యేక కడప జిల్లాలో జగన్ ఆధిపత్యానికి బ్రేకులు వేసేలా..ఇప్పుడు ఏకంగా పులివెందుల నుంచే యాక్షన్ స్టార్ చేసింది. టీడీపీ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.రాష్ట్ర పశు సంవర్థక శాఖ సంచాలకులు డా.టి.దామోదర నాయుడు మాట్లాడుతూ సైబీరియన్ వలస పక్షులు రెట్టల వల్ల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ బర్డ్ ప్లూ వ్యాప్తి చెందిందన్నారు. ఆయా ప్రాంతాలను రెడ్ జోన్ లుగా ప్రకటించి వ్యాధి నియంత్ర్రణా చర్యలను తీసుకోవడం జరుగుచున్నదన్నారు. ఇప్పటి వరకూ 14 వేల కోళ్లను కాల్చేయడంతో పాటు 340 గుడ్లనునాశనం చేయడం జరిగిందన్నారు. మరో రెండు మూడు ఫౌల్ట్రీలో 1.40 లక్షల కోళ్ల వరకూ ఉన్నాయని, వాటిని కూడా కాల్చేసే చర్యలు చేపట్టినట్టు వివరించారు.

Related Posts