నాని శ్రీ రెడ్డి వివాదం ఫై తమిళ హీరో విశాల్ స్పందించాడు. ‘‘నాకు నాని చాలా కాలంగా తెలుసు. అతను నాకు మంచి స్నేహితుడు. అంతమాత్రాన నేను అతణ్ని గుడ్డిగా సమర్థించను. తాజాగా నానిపై ఆమె (శ్రీరెడ్డి) చేసిన ఆరోపణలు అసమంజసంగా ఉన్నాయి. నాని గురించి తెలిసిన వాళ్లందరికీ సాటి మనుషులతో అతని ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసు. ఏదో పబ్లిసిటీ కోసం ఆరోపణలు చేయడం కాకుండా.. ఆమె వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలి అని విశాల్ ఒక ఇంటర్వ్యూ లో అన్నాడు.