YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేసీఆర్ పై కేసు పెట్టిన వ్యక్తి... రాజాలింగం... దారుణ హత్య

కేసీఆర్ పై కేసు పెట్టిన వ్యక్తి... రాజాలింగం... దారుణ హత్య

కరీంనగర్, ఫిబ్రవరి 20, 
తెలంగాణలో దారుణం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ నాగవల్లి సరళ భర్త రాజ లింగమూర్తిని కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసి చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు ఆయన మృతి చెందాడు. మేడిగడ్డ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు పలువురిపై భూపాలపల్లి కోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తి రాజలింగమూర్తి. దీంతో మూర్తి హత్య వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేసు వేసిన భూపాలపల్లికి చెందిన 47 ఏళ్ల రాజలింగమూర్తి.  కోర్టు అప్పట్లో కేసీఆర్‌, హరీష్‌రావుకు నోటీసులు జారీ చేసింది. దీంతో లింగమూర్తి పేరు తెలుగులోకి వచ్చింది . రాజలింగమూర్తి దారుణహత్యకు గురయ్యాడు. ఆయనను హత్య చేయడానికి కారణమేంటి? రాజకీయ కక్షలే కారణమా? ఏమైనా భూతగాదాలు ఉన్నాయా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. ఈ వ్యవహారంపై రకరకాల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి ఏడున్నర గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాజలింగమూర్తిపై దాడి చేశారు. తమతో తెచ్చుకున్న కత్తులు, గొడ్డళ్లతో ఆయన్ని అత్యంత దారుణంగా నరికి చంపారు. ఈయనపై గతంలో భూతగాదాల కేసులు నమోదయ్యాయి. హత్యకు సంబంధించి రకరకాల కారణాలు బయటకు వస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.రాజలింగమూర్తి మున్సిపల్ మాజీ కౌన్సిలర్‌ నాగవెళ్లి సరళ భర్త. 2019లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో భూపాలపల్లిలోని 15వ వార్డు నుంచి ఆమె బీఆర్ఎస్ తరఫున కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఏం జరిగిందో తెలీదుగానీ కొద్దినెలల తర్వాత నాగవెళ్లి సరళను కారు పార్టీ బహిష్కరించారు.బాధితుడి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం రాజలింగమూర్తి తన స్వగ్రామం జంగేడులో సోదరుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లాడు. టూ వీలర్స్‌పై భూపాలపల్లికి తిరిగి వస్తున్నాడు. అయతే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎదురుగా రోడ్డును దాటుతున్న సమయంలో దాదాపు ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు క్యాంపులు ధరించి ఆయన్ని చుట్టుముట్టారు. పలు ప్రశ్నలు లేవనెత్తారని తెలుస్తోంది.ఈ క్రమంలో వాళ్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పట్టరాని కోపంతో తమతో తెచ్చుకున్న కత్తులు, గొడ్డళ్లతో రాజలింగమూర్తిని నరికి చంపేశారు దుండగులు. రక్తపు మడుగులో ఆయన పడిపోయాడు. బలమైన కత్తిపోట్ల కారణంగా పేగులు బయటకు వచ్చాయి. తలకు బలమైన గాయం అయ్యింది. హత్య విషయం తెలియగానే స్థానికులు ఆయన్ని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.రాజలింగమూర్తి హత్యపై ఆయన కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనివెనుక మాజీ ఎమ్మెల్యే , మాజీ సర్పంచి , వార్డు మాజీ కౌన్సిలర్‌ కారణమని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని రాజలింగమూర్తి భార్య సరళ, కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో రాత్రి బైఠాయించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు డిమాండ్‌ చేశారు.రాజలింగమూర్తి హత్యకు భూ తగాదాలే కారణమనే వాదన సైతం లేకపోలేదు. రెండు దశాబ్దాలుగా వరంగల్‌కు చెందిన ఓ న్యాయవాది ద్వారా భూ సమస్యలను పరిష్కరించేవాడు రాజలింగమూర్తి. గతంలో ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఓపెన్ ‌కాస్ట్‌ గనుల తవ్వకాలతో పర్యావరణం దెబ్బతింటోందని సింగరేణిపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో ఫిర్యాదు చేసిన వ్యక్తి రాజలింగమూర్తి.

Related Posts