
బీజాపూర్
మావోయిస్టులు టీచర్ బామన్ కశ్యప్, గ్రామస్తుడు అనీష్ రామ్ ను గొంతు కోసి హత్య చేశారు. ఇంటి నుండి కొద్ది దూరంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు కోసి చంపారు. హత్యానంతరం ఇద్దరి మృతదేహాలను తీసుకువచ్చి గ్రామం సమీపంలో వదిలి వెళ్లారు. వారిద్దరూ పోలీసు ఇన్ఫార్మర్లనే నెపంతో హత్య చేసినట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ తూర్పు బస్తర్ డివిజన్ కమిటీ ఈ హత్యలకు పాల్పడ్డట్టు సమాచారం. ఈ సంఘటన గురించి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.