కడప ఉక్కు కర్మాగారం కోసం ఆమరణ దీక్ష చేస్తానని ఎంపీ సి.ఎం.రమేశ్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 17,18 తేదీల్లో ప్రధాని సమయం కోరానన్నారు. సమయమిస్తే ప్రతినిధి బృందంతో ప్రధానిని కలిసి కడప ఉక్కు కర్మాగారంపై విజ్ఞాపన ఇస్తామన్నారు.కడప స్టీల్ ప్లాంట్ పై కేంద్రం మీటింగ్ పెట్టింది. అంత ఆశాజనకంగా లేదు. నా విజ్ఞాపన కు కేంద్రం స్పందించకపోతే కడపలో అన్ని వర్గాలవారిని కలుపుకొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. ఆంధ్ర ప్రజలు బాధపడుతున్న కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. వైసీపీ రాజీనామాల డ్రామా కోనసాగుతోంది . కనీసం రాజీనామాలు ఆమోదింపజేసుకోలేకపోతున్నారని అన్నారు. కర్ణాటకలో ముగ్గురు ఎంపీ లు రాజీనామాలు చేస్తే 24 గంటల్లో ఆమోదించారు. మళ్ళీ పార్లమెంట్ లో అవిశ్వాసం పెడతాము. డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో సత్తా చాటుతం.పొలవారంను చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారు. పోలవరం.. ఆంధ్ర, రాయలసీమకు ఒక వరం.ఆంధ్రాలో బీజేపీకి ఎలాంటీ అవకాశం లేదు. దీక్షకు అందర్నీ పిలుస్తా... అన్ని పార్టీలను పిలుస్తా. వైసీపీ, బీజేపీ కలిసిపోయాయి . వైజాగ్ రైల్వే జోన్ కి రాజకీయ నిర్ణయం చాలు.. నిధులు అవసరం లేదు. అయిన నిర్ణయం తీసుకోవడం లేదు.