
కరీంనగర్
మొన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ లో ఇండియా గెలిచింది. బీజేపీది ఇండియా జట్టు. పాకిస్తాన్ గెలిస్తే సంబురాలు చేసుకునే ఎంఐఎంతో అంటకాగుతున్న కాంగ్రెస్ ది పాకిస్తాన్ జట్టు. ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల మ్యాచ్ లోనూ గెలుపు బీజేపీదే. పాకిస్తాన్ ను చిత్తు చేసి తీరుతాం’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 14 నెలల పాలన బాగుందని విర్రవీగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకునేందుకు సిద్దమా? అని సవాల్ విసిరారు. తెలంగాణసహా ఏ గ్రామానికి, ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్ కు కేంద్రం ఎన్ని నిధులిచ్చింది? రాష్ట్రం ఎంత ఖర్చు చేసిందనే వివరాలపై లెక్కా పత్రంతో సహా బహిరంగంగా చర్చించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. తాము గతంలోనే సవాల్ చేస్తే సీఎం తోకముడిచిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈరోజు ఉదయం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు పాయల శంకర్, కాటేపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్పలతో కలిసి బండి సంజయ్ మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టులో పిటిషన్ వేసి సీబీఐ విచారణ జరిపించాలని కోరితే ప్రభుత్వం ఒప్పుకోని విషయం నిజం కాదా?. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతే ప్రభాకర్ రావు, శ్రవణ్ విదేశాలకు పారిపోయారు. మీరు వాళ్లను అరెస్ట్ చేయకుండా పారిపోయేలా చేసిందే కాంగ్రెస్. మీరు విదేశాలకు పంపిస్తే...మేం పట్టుకురావాలా? కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని పోలీసులు చెప్పిన తరువాత కూడా ఆయనకు కనీసం నోటీసు కూడా ఎందుకియ్యలే?.
నన్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించి బీసీలకు అన్యాయం చేశారనడం అబద్దం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా ప్రమోషన్ ఇచ్చింది.కాంగ్రెస్ పాలన బాగుందని విర్రవీగుతున్న సీఎంకు సవాల్ చేస్తున్నా...మీ 14 నెలల పాలనపై ఎమ్మెల్సీ ఎన్నికలే రెఫరెండంగా తీసుకుందామా అని సవాల్ విసిరారు.