
అమరావతి,
టైమ్ డేట్ రాసుకోండి ఎవరినీ వదిలేది లేదు మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దని మంత్రి నారా లోకేశ్ వైసీపీ సభ్యులకు సూచించారు. విశ్వవిద్యాలయాల్లో బెదిరించి వీసీలను రాజీనామా చేయించాం అనడం సరికాదన్నారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ. వీసీల రాజీనామాకు ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాలపై విచారణ జరుగుతుందన్నారు. అందుకే ఒకరు జైలులో ఉన్నారని అన్నారు. ఎవరైతే తమ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెట్టారో వారిని వదిలేది లేదని వాళ్లు టైమ్ డేటు రాసి పెట్టుకోవాలన్నారు.