YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వ్యవసాయ కాళాశాలకు శంకుస్థాపన చేసిన మంత్రులు పోచారం, కేటీఆర్

వ్యవసాయ కాళాశాలకు శంకుస్థాపన చేసిన మంత్రులు పోచారం, కేటీఆర్
జిల్లాలోని సిరిసిల్ల మండలం సర్ధాపూర్ గ్రామంలో వ్యవసాయ కళాశాలకు చేసిన మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కెటిఆర్ బుధవారం నాడు  శంకుస్థాపన చేసారు. ఈ సందర్బంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ  తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల జిల్లా  సస్యశ్యామలం అవుతుంది.  నీళ్లు, నిధులు, నియామకాలు కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం లక్ష్య సాధనలో దూసుకెళుతుందని అన్నారు.  38 లక్షల ఎకరాలకు, మూడు పంటలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో రికార్డు లో నిలవనుంది.  సమైక్య పాలనలో కన్నీళ్లు చూసిన సిరిసిల్ల ప్రాంతం ఇప్పుడు నీటి కళ సంతరించుకోనుంది. రూ. 30 కోట్లతో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేసుకోవడం వల్ల వ్యవసాయ రంగం అభివృద్ధి అవుతుందని అన్నారు.  తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి వ్యాఖ్యలు నిజం కానున్నాయి.  ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి నియామకం ద్వారా వ్యవసాయానికి మెరుగైన సేవలు అందుతాయని అన్నారు.  రాబోయే 6 నెలల్లో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు నీరు వస్తుంది.  ముఖ్యమంత్రి కృషి వల్ల వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల కరెంటు సరఫరా.  పంటకు బీమాతో మద్దతు ధరను కేంద్రం పరిధిలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు.  రైతు బీమా రూపంలో 18 నుండి 60 ఏళ్ల లోపు రైతులకు రూ. 5 లక్షల బీమా కు ఆగస్టు నుండి శ్రీకారం చుడుతున్నామని అన్నారు.  రైతుల కోసం రూ. 2,271 లను ప్రీమియం మొత్తాన్ని ఎల్ఐసి కి రాష్ట్రం చెల్లించనుంది.  రాష్ట్రంలో రైతు బీమా కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాను నెం. 1 గా ఉంచాలని అన్నారు.  దేశంలో రైతుల కోసం ఇంతవరకు ఎవరూ చేయని కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేస్తున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో వ్యవసాయం పండుగ కానుందని అన్నారు.  మంత్రి పోచారం మాట్లాడుతూ  మంత్రి కెటిఆర్ కోరిక మేరకు ఈ ఏడాది నుండే వ్యవసాయ కళాశాలలో తరగతుల ప్రారంభం కానున్నాయి. 75 ఎకరాల్లో రూ. 30 కోట్లతో ఈ వ్యవసాయ కళాశాలకు అనుమతి వచ్చిందని అన్నారు.  రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్.  ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు సిఎం కృషి చేయనున్నారు.  86 ఏళ్ల తర్వాత రూ. వెయ్యి కోట్లతో నిజాం సాగర్ ప్రాజెక్టును ఆధునీకరణించుకున్నం.  వచ్చిన 4 ఏళ్లలో తెలంగాణ ఎంతో ప్రగతి. - విత్తనం వేసిన నుండి పంట కొనుగోలు వరకు రైతులకు ముఖ్యమంత్రి అండ వుంటుందని అన్నారు.  పార్టీలు, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నం.  ఒకే సంవత్సరంలో వ్యవసాయ పాలిటెక్నిక్, వ్యవసాయ కళాశాల ఏర్పడిన నియోజకవర్గం సిరిసిల్ల అని అన్నారు.

Related Posts