YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రజల చేతిలోనే ఆరువేల కోట్లు

ప్రజల చేతిలోనే ఆరువేల కోట్లు

ముంబై,, మార్చి 3, 
నకిలీ కరెన్సీ, అసాంఘిక శక్తుల చేతుల్లో భారీగా నగదు నేపథ్యంలో కేంద్రం 2000 రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్తగా రూ.2 వేల నోట్లు ముద్రించింది. అయితే ఈ నోట్లు కూడా అక్రమాలకు కారణం అవుతుండడం, బ్లాక్‌ చేస్తుండడంతో 2023, మే 19న రూ.2 వేల నోట్లు ఉప సంహరించుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నోట్లు ఉన్నవారు బ్యాంకులో డిపాజిట్‌ చేయాలని తెలిపింది. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం ఇప్పటికీ రూ.2 వేల నోట్లు ప్రజల వద్ద ఉన్నాయి. మొత్తం రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ. 2,000 నోట్లలో 98.18% (అంటే దాదాపు రూ. 3.49 లక్షల కోట్లు) బ్యాంకింగ్‌ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. అయితే, ఇంకా ప్రజల వద్ద రూ. 6,471 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు ఉన్నాయని ఆర్‌బీఐ తెలిపింది.
మొత్తం విలువ (మే 19, 2023 నాటికి): రూ. 3.56 లక్షల కోట్లు
తిరిగి వచ్చిన విలువ (మార్చి 1, 2025 నాటికి): రూ. 3.49 లక్షల కోట్లు (98.18%)
ప్రజల వద్ద మిగిలిన విలువ: రూ. 6,471 కోట్లు
ఈ రూ. 2 వేల నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైన కరెన్సీగా (లీగల్‌ టెండర్‌) కొనసాగుతున్నాయి. అంటే, వీటిని లావాదేవీల కోసం ఉపయోగించవచ్చు లేదా బ్యాంకుల్లో జమ చేయవచ్చు. ప్రజలు ఈ నోట్లను ఆర్‌బీఐ 19 ఇష్యూ ఆఫీసులలో జమ చేయవచ్చు లేదా ఇండియా పోస్ట్‌ ద్వారా ఆర్‌బీఐ ఆఫీసులకు పంపి తమ బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయించుకోవచ్చు.రూ.2 వేల నోట్లు ఉప సంహరణ తర్వాత నోట్ల మార్పిడి లేదా డిపాజిట్‌కు ప్రజలకు 2023 సెప్టెంబర్‌ 30 వరకు అవకాశం కల్పించింది. తర్వాత అక్టోబర్‌ 7 వరకు గడవు పొడిగించింది. ఆ తర్వాత ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే నోట్లు స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు 98.18 శాతం నోట్లు బ్యాంకులకు చేరినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఇప్పటికీ నోట్లు ఉన్నవారు రిజర్వు బ్యాంకు రీజినల్‌ ఆఫీజుల్లో లేదా పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా ఆయా కార్యాలయాలకు పంపాలని పేర్కొంది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, బేల్పుర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగడ్, చెన్నై, గౌహటి, జైపూర్, జమ్మూ, కాన్‌పూర్, కోల్‌కతా, లఖన్‌పూర్, ముంబై, నాగ్‌పూర్, ఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీ ప్రాంతీయ కార్యాలయాల్లో డిపాజిట్‌ చేయవచ్చు.

Related Posts