టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని, మతోన్మాద మజ్లిస్ పార్టీ నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలంటే బిజెపికి రాష్ట్ర ప్రజలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మన్ అన్నారు. లౌకికతత్వం గురించి మాట్లాడే టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీతో ఎలా పొత్తుపెట్టుకుంటుందని, తెలంగాణ ప్రజలు వీరి అవకాశ వాద చర్యలను తిప్పికొట్టడం ఖాయమని, 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పరాభవం తప్పదని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో బిజెపిలో చేరిన సందర్భంగా డాక్టర్ లక్ష్మన్ మాట్లాడుతూ...మోదీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల వల్లే యువత, ఆయా పార్టీల నాయకులు బిజెపిలో చేరుతున్నారని, ఇవాళ బిజెపి దేశవ్యాప్తంగా విజయకేతనాన్ని ఎగురవేస్తూ వస్తుందని, కర్ణాటకలో బిజెపి విజయం సాధించినప్ టికీ అపవిత్ర కలయికల ఫలితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందన్నారు. మోదీ విధానాలు, ప్రజా సంక్షేమ పథకాల వల్లే కర్ణాటకలో అధిక సీట్లు సాధించగలిగామని డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు, విధానాలను నేరుగా ఎదుర్కోలేని ప్రతిపక్ష పార్టీలు తామేం అయినా ఫర్వాలేదు కానీ మోదీ బిజెపి అధికారంలోకి రాకూడదన్నట్లు వ్యవహరిస్తున్నాయన్నారు. దేశాన్ని పాలించే హక్కు తమకు మాత్రమే ఉందన్నట్లు కాంగ్రెస్ వ్యవహరిస్తుందని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు.ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న పార్టీలు.. తమ సిద్ధాంతాలు, విధానాలను మరిచిపోయి కర్ణాటకలో అధికారంలోకి రావడం చూస్తే వారికి ఎంత అధికార దాహం ఉందో అర్ధమవుతుందన్నారు.అవినీతిపై చర్యలు తీసుకోవడం తన చేతుల్లో లేదని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పడం చూస్తే కుమారస్వామి కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మగా మారినట్లు స్పష్టమవుతుందని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. చంద్రబాబు, కేసీఆర్ సలహా మేరకే కాంగ్రెస్‌తో జట్టుకట్టామని కుమారస్వామి వెల్లడించడం చూస్తే... బిజెపి పట్ల ఆ పార్టీలకు ఎంత అక్కసు ఉందో స్పష్టం చేస్తుందన్నారు. తెలంగాణలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నట్లు నటిస్తూ.. దేశమంతా ఒక్కటిగా కాంగ్రెస్, టీఆర్ఎస్,టీడీపీలుదేశమంతా ఒక్కటిగా ఉంటున్నాయని , ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు. కర్ణాటకలో జేడీఎస్ పోషించిన పాత్రను తెలంగాణలో టీఆర్ఎస్ పోషిస్తుందని, స్వార్ధపర, కులతత్వ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని డాక్టర్ లక్ష్మన్ హెచ్చరించారు. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్ సభ స్థానాల్లో గెలుపు కోసం ఏ రకంగా ముందుకు పోవాలో వ్యూహాన్ని రచించి ముందుకు తీసుకెళ్లేలా దిశానిర్దేశం చేసేందుకు జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఒక్కరోజు పర్యటనకు వస్తున్నారని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు.లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్‌ను రెండుసార్లు ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, దళితులకు అడుగడుగునా అన్యాయం చేసిన కాంగ్రెస్ ఓట్ల కోసం దళితులను మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. దళితుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో అనేక కార్యక్రమాలు చేపడుతూ.. వారి ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ బిజెపి మాత్రమేనని డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు. వరంగల్ సభ సింహగర్జన కాదని, అది కేవలం కాంగ్రెస్ పార్టీ గర్జన మాత్రమేనని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు.