పొక్లెయిన్లు, యంత్రాలతో గోదావరిలో జరుగుతున్న తవ్వకాలను ప్రస్తావించి నదికి జరుగుతున్న నష్టాన్నిజగన్ ప్రజలకు వివరించారు. 2004 ఎన్నికల్లో తన తండ్రిని ఆదరించిన తూర్పుగోదావరి జిల్లా ప్రజలు 21 అసెంబ్లీ సీట్లకు 18 సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. మీ దీవెనలకు గుర్తుగా జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆయా పనులను వివరించారు. రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ, వ్యవసాయ కళాశాలలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. బుధవారం జగన్ 188వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వేష్టేషన్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు వారందరికి భరోసా ఇస్తూ వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రైల్వే ష్టేషన్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర అడుశంభునగర్, లక్ష్మీనరసింహా నగర్ మీదుగా ధవళేశ్వరం చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. లంచ్ అనంతరం ధవళేశ్వరం, బొబ్బర్లంక, పేరవరం వరకు పాదయాత్ర కొనసాగుతుందికాకినాడలో జేఎన్‌టీయూ బ్రాంచ్ యూనివర్సిటీని ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. పోలవరం ఎడమ, కుడి కాలువలు దాదాపు పూర్తి చేశారని గుర్తు చేశారు. రూ.3 వేల కోట్లతో గోదావరి డెల్టా కాలువల ఆధునికీకరణ పనులు చేశారని పేర్కొన్నారు. గోదావరిపై నాలుగో బ్రిడ్జి తన తండ్రి వైఎస్ హయాంలోనే వచ్చిందన్న విషయం ప్రస్తావించారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాజమహేంద్రవరంలోని ఆవ ప్రాంతంలో 36 ఎకరాలు సేకరించి 26 ఎకరాల్లో ఇళ్లు కట్టించారని గుర్తు చేశారు. మిగిలిన 10 ఎకరాలను పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయగా వాటినీ ఆక్రమించారని మండిపడ్డారు. కొత్తగా ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన పాలకులు ఆ పని చేయకుండా తిరిగి పేదల స్థలాలను లాక్కుంటున్నారని ప్రస్తావించడంతో ప్రజలు ‘అవును.. అవును..’ అంటూ చేతులు పైకెత్తారు. చదరపు అడుగు రూ.1000 అయ్యే ఫ్లాట్లకు రూ.2000 చొప్పున తీసుకుంటూ లంచాలు మెక్కుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు తీసుకున్న లంచాలకు ఫ్లాట్లు తీసుకున్న వారు నెల నెలా రూ.3000 చొప్పున 20 ఏళ్ల పాటు బ్యాంకులకు కట్టుకుంటూ పోవాలా? అని ప్రశ్నించిన వైఎస్ జగన్ మనందరి ప్రభుత్వం వచ్చాక బ్యాంకు అప్పు రూ.3 లక్షలు మాఫీ చేస్తానని ప్రకటించడంతో సభలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.