YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణకు కేంద్రం అండగా నిలవాలని విజ్ఞప్తి మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణకు కేంద్రం అండగా నిలవాలని విజ్ఞప్తి మంత్రి శ్రీధర్ బాబు

మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో రూ. 3,225 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న అమరరాజా గిగా ఫ్యాక్టరీ -1, ఆల్టిమిన్ ప్రైవేట్ లిమిటెడ్, లోహమ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్లకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలిసి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు  భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్" తెలంగాణలో 262 ఎకరాల విస్తీర్ణంలో పదేళ్లలో రూ. 9,852 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 4,500 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. ఇప్పటికే రెండు యూనిట్లు నిర్మాణంలో ఉండగా, తాజాగా రూ. 1,900 కోట్లతో మూడో యూనిట్  నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని అన్నారు.
ఆల్టిమిన్ ప్రైవేట్ లిమిటెడ్" లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్ పీ) టెక్నాలజీ ఆధారంగా బ్యాటరీలు, ఇతర కీలక పదార్థాలను ఉత్పత్తి చేయనుంది. దివిటిపల్లిలో 20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 800 కోట్ల వ్యయంతో మూడేళ్లలో రెండు దశల్లో ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తి కానుంది. సుమారు 300 మందికి ఉపాధి లభిస్తుంది.
సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్"క్యాన్స్, క్యాప్స్ తయారీ సంస్థ. ఇది నికెల్ పూతతో స్టీల్ క్యాన్లు, లిథియం అయాన్ సెల్స్ కోసం క్యాప్స్ ను ఉత్పత్తి చేయనుంది. రూ.23 కోట్ల వ్యయంతో 6 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ప్లాంట్ ద్వారా 150 మందికి ఉపాధి కల్పించనుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పై విశ్వాసం ఉంచి  పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలకు కృతజ్ఞతలు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని అన్నారు.
ఇతర రాష్ట్రాలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు కేంద్రం అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించాలని కోరుతున్నాని అన్నారు.
సెమీ కండక్టర్స్ పరిశ్రమల ఏర్పాటుకు, అభివృద్ధికి తెలంగాణ అనుకూలంగా ఉంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చొరవ తీసుకుని,  తెలంగాణ లో సెమీ కండక్టర్స్ పరిశ్రమల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాని అన్నారు.
పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అనేక చర్యలను తీసుకుంటున్నాం. ప్రత్యేకంగా
తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ & ఎనర్జీ స్టోరేజ్ పాలసీ, తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చాం. దివిటిపల్లిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్(ఈఎంసీ) కోసం భూములు త్యాగం చేసిన రైతులకు కృతజ్ఞతలు. ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ క్లస్టర్ ను మరింత అభివృద్ధి చేసి,  తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేస్తాం.  తెలంగాణలో చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం మా లక్ష్యం. పరిశ్రమలను ఒక్క ప్రాంతానికే పరిమితం చేయకుండా  అన్ని ప్రాంతాలకు విస్తరిస్తమని అన్నారు.

Related Posts