
హైదరాబాద్, మార్చి 10
డాలర్ వీక్‌గా మారడంతో పాటు పసిడిపైపు పెట్టుబడులు పరుగులు పెడుతుండే సరికి గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేటు కాస్త పెరిగింది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 2,918 డాలర్ల దగ్గర ఉంది. ఈ రోజు మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) ధర 110 రూపాయలు, ఆర్నమెంట్ గోల్డ్ (22 కేరెట్లు) ధర 100 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 90 రూపాయల చొప్పున పెరిగాయి. ఈ లెక్కన, 100 గ్రాముల ప్యూర్ గోల్డ్ (24K) ధర ఈ రోజు రూ. 1100 జంప్ చేసింది. కిలో వెండి రేటు 100 రూపాయలు తగ్గింది.హైదరాబాద్‌మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,820 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 80,500 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 65,870 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 1,08,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,820 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 80,500 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 65,870 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 1,08,000 గా ఉంది. విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.