
సికింద్రాబాద్
ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్స్ లో కలుషిత ఆహారం అందిస్తున్నారని, కనీస మౌలిక వసతులు కల్పించలేకపోతున్నారని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తినే అన్నంలో బ్లేడు రావడంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. నాణ్యమైన ఆహారం అందించడం లేదని, కనీస మాలిక వసతులు అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆహారం అందించాలని, తమ సమస్యను పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన చేపడుతామని విద్యార్థులు హెచ్చరించారు. కనీస సౌకర్యం కల్పించలేని పరిస్థితిలో ఓయూ అధికారులు ఉన్నారని విద్యార్థులు మండిపడ్డారు.