
హైదరాబాద్
ఇది గవర్నర్ ప్రసంగం కాదు గాంధీ భవన్ ప్రసంగమని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ను మోసం చేసింది. బీసీల కోసం మాట్లాడిన ఎమ్మెల్సీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ తల్లిని సచివాలయంలో పెట్టారు, కాంగ్రెస్ తండ్రిని సచివాలయం బయట పెట్టారు.మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ తల్లిని, తండ్రిని భద్రంగా గాంధీ భవన్ కు పంపిస్తాం.
ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకొండి.రాష్ట్రంలో 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.వారి కుటుంబాలకు భరోసా ఇచ్చే ఒక్కమాట గవర్నర్ నోటి నుంచి రాలేదు.రాష్ట్రంలో 35 శాతం కూడ రైతు రుణమాఫీ జరగలేదు.ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం రైతు రుణమాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. రైతు రుణమాఫీ 100 శాతం పూర్తి అయిందని రైతులు సంతోషంగా ఉన్నారని గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు.సాగు , తాగు నీటి సంక్షోభం రోజురోజుకు ఎక్కువ అయిపోతుంది. రేవంత్ రెడ్డి అనే చేతగాని ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి.సచివాలయంలో 20 శాతం కమిషన్ ల కోసం ధర్నాలు చేశారు.నో విజన్, ఓన్లి కమిషన్.కమిషన్ నుంచి వచ్చిన డబ్బులను ఢిల్లికీ మూటలు పంపుతున్నారు.ఒక లక్ష 62 వేళ కోట్ల రూపాయలు అప్పులు చేశారు.మా హయంలో నాలుగు గున్నర లక్షల కోట్లకు పైగా వ్యవసాయానికి ఖర్చు చేశాం.వరి ధాన్యం పెరిగిందని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు.ఊర్లోలల్లో కాంగ్రెస్ నాయకులను తన్ని తరిమి కొడుతున్నారు.30 శాతం కమిషన్ ఇస్తేనే మంత్రులు పనిచేస్తున్నారని స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఒక్క గ్యారెంటీ , 420 హామీల్లో ఒక్క హామీ ఇవ్వకుండా లక్ష 60 వేళ కోట్ల రూపాయిలు అప్పులు చేశారని అన్నారు.