
న్యూఢిల్లీ
ఢిల్లీలో పార్లమెంటరీ వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ 15వ ఆవిర్భావ వేడులకను ఘనంగా నిర్వహించారు, దివంగత వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించారు. తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే లక్ష్యంగా తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో సుపరిపాలన సాగిందన్నారు. తద్వారా ప్రజల గుండెల్లో వైఎస్సార్సీపీ నిలిచిందన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన పార్టీ నేడు 15 వ వసంతంలో అడుగు పెడుతున్న ఈ రోజు మనమంతా గర్వించాల్సిన రోజు అని అన్నారు. కష్ట సమయంలో పార్టీకి అండగా నిలబడి వైఎస్సార్సీపీ బలోపేతనికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిధున్ రెడ్డి, మేడా రఘునాధ రెడ్డి, అయోధ్య రామి రెడ్డి, గొల్ల బాబూరావు, గుమ్మా తనూజా రాణి పాల్గొన్నారు.