YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

144 కోట్లు దాటిన భారత జనాభా

144 కోట్లు దాటిన భారత జనాభా

న్యూఢిల్లీ, మార్చి 13, 
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా గుర్తింపు ఉన్న భారత్‌లో జనాభా రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. 150 కోట్లవైపు వేగంగా దూసుకెళ్తోంది. మరో 77 ఏళ్లలో భారత జనాభా 2011 లెక్కల ప్రకారం రెట్టింపు అవుతుందని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి అంచనా వేసింది. ఈమేరకు తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈమేరకు పేర్కొంది. ఈ నివేదికలో ఇంకా చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పదేళ్లుగా ఇండియాలో శిశు మరణాలు బాగా తగ్గాయని తెలిపింది. 2011లో జరిపిన జనాభా లెక్కల ప్రకారం భారత జనాభా 121 కోట్లు. ఇప్పుడు అది 144.17 కోట్లకు చేరిందని ఐక్యరాజ్య సమితి జనాభా నిధి అంచనా వేసింది. 13 ఏళ్లలో 23 కోట్ల మంది పెరిగినట్లు తెలిపింది. ఇక చైనా 142.5 కోట్ల జనాభాతో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.ఇక ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం భారత్‌లో యువ జనాభా పెరిగింది. జనాభాలో 14 ఏళ్లలోపు వారు 24 శాతం మంది ఉన్నారు. 10 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న టీనేజర్లు 17 శాతం ఉండగా, 10 నుంచి 24 ఏళ్ల మధ్య యువత 68 శాతం ఉంది. ఇక 65 ఏళ్లు దాటిన వారి జనాభా కేవలం 7 శాతంగా ఉంది. ఇండియాలో యువ జనాభా ఎక్కువగా ఉండడం దేశ అభివృద్ధికి అనుకూల అంశం.ఇక భారత్‌లో ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరిగాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది. అందుకే ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు వెల్లడించింది. దేశంలో పురుషుల సగటు ఆయుష్షు 71 ఏళ్లు ఉండగా, మహిళల ఆయుష్షు 74 ఏళ్లుగా ఉందని వివరించింది.మొత్తంగా ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం భారత్‌లో జనాభా పెరుగుతున్నా.. దేశంలో ఆర్థిక, సామాజిక పరిస్థితులు కూడా మెరుగవుతున్నాయి. ఆరోగ్య రంగం మెరుగుపడుతోంది. ఆయుష్షు పెరుగుతోంది. శిశు మరణాలూ తగ్గుతున్నాయి. ఇవన్నీ శుభసూచకమే అని భారతీయులు అభిప్రాయపడుతున్నారు. భారత జనాభా 150 కోట్లకు చేరిన తర్వాత.. తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

Related Posts