
హైదరాబాద్
కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి రావడం కాదు. అసెంబ్లీలో చర్చలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. గాంధీ కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదు. నేను ఎవరో తెలియకుండానే..నన్ను పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రిగా చేశారా. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను.. కిషన్రెడ్డి పట్టించుకోవడంలేదు. నేను ఆరు గ్యారంటీలకు నిధులు అడగడం లేదు. ఆర్ఆర్ఆర్ మెట్రో, మూసీ ప్రాజెక్టులకు నిధులు అడుగుతున్నా. తెలంగాణలో నేను చేసినన్ని పాలసీలు ఎవరూ చేయలేదు. రాష్ట్రానికి రూ.2.2 లక్షలకోట్ల పెట్టుబడులు తెచ్చాం. నిరుద్యోగ రేటును 8.8 నుంచి 6.1 శాతానికి తగ్గించామని అన్నారు.