YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సీఎం రేవంత్ రాబిస్ వ్యాధి సోకిన పిచ్చికుక్క లెక్క మాట్లాడుతుండు

సీఎం రేవంత్ రాబిస్ వ్యాధి  సోకిన పిచ్చికుక్క లెక్క మాట్లాడుతుండు

హైదరాబాద్
సీఎం రేవంత్ రెడ్డి రాబిస్ వ్యాధి సోకిన పిచ్చికుక్క లెక్క మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కందుల మధు మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. కందుల మధు ఆధ్వర్యంలో బీఆర్ఎస్వి నాయకులు కుక్కకు రేవంత్ రెడ్డి తల ఉన్న ఫోటోని పెట్టి రాబిస్ ఇంజెక్షన్ ను ఫొటోకు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కెసిఆర్ పైన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ఓయూలో మాట్లాడారు. ప్రజలు రాష్ట్రాన్ని పరిపాలించమని ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే నువ్వు కేసీఆర్ ని మార్చురీకి పంపిస్తానంటూ మాట్లాడుతుకున్నావు బుద్ధండా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రికి కనీసం మర్యాద ఇవ్వకపోవడం సరికాదన్నారు. కెసిఆర్ అంటే యావత్ తెలంగాణా ప్రజలతో సమానం అన్నారు. కెసిఆర్ ను మార్చరీకి పంపిస్తామని మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కెసిఆర్ ను ఎదుర్కొనే దైర్యం లేక ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని, పిచ్చి కుక్క కరిచినట్లు మాట్లాడుతున్న రేవంత్ తన స్థాయి ఏమిటో మర్చిపోయాడని మండిపడ్డారు.

Related Posts