
హైదరాబాద్, మార్చి 13,
అసెంబ్లీలో స్పీకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే సభ నుంచి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెండ్ చేశారు. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఆయన సస్పెండ్ కు గురయ్యారు. సస్సెండ్ అయిన అభ్యర్థిని బయటకు పంపాలని స్పీకర్ ఆదేశించారు.జగదీష్ రెడ్డి మాట్లాడిన వీడియోను మంత్రులు పరిశీలించారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. జగదీష్ రెడ్డిని సస్సెండ్ చేయాలని స్పీకర్ కు మంత్రులు ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారుముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సభ అందరిదీ.. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉంటాయని అన్నారు. సభ్యుల అందరి తరఫున పెద్ద మనిషిగా స్పీకర్ వ్యవహరించాలని చెప్పారు. ఈ సభ మీ సొంతం కాదని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే సభా సంప్రదాయాలకు విరుద్ధంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడారని స్పీకర్ ఆక్షేపించారు.ఈ క్రమంలోనే.. దళిత స్పీకర్ ను ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అవమానించారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. స్పీకర్ కు కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదని వారు ఫైరయ్యారు. జగదీష్ రెడ్డిపై స్పీకర్ వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అసెంబ్లీలో అధికారులు, మార్షల్స్ ను అలెర్ట్ చేశారు. అసెంబ్లీలో లాబీలో భారీగా మార్షల్స్ చేరుకున్నారు.అయితే ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేయడంతో బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేస్తున్నారు.