వరుస ప్లాపులతో డీలా పడిపోయాడు అల్లు అర్జున్. ప్రస్తుతం బన్నీ తన తదుపరి చిత్రాన్ని"మనం" ఫేమ్ విక్రం కుమార్ దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్టుతో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంతో విజయం సాధించి మళ్ళి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు స్టైలిష్ స్టార్.