YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తువేయండి

జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తువేయండి

హైదరాబాద్
 సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్ఎస్ శాసనసభా పక్షం స్పీకర్ ని కోరింది.  స్పీకర్  పట్ల సీనియర్ శాసన సభ్యుడైన జగదీశ్ రెడ్డి  అమర్యాదగా ప్రవర్తించలేదు. సస్పెన్షన్ పై  ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కానీ, బీఆర్ఎస్ పార్టీ తరపున వివరణ కానీ, సస్పెన్షన్కు గురైన సభ్యుడు జగదీశ్ రెడ్డి  వివరణ  తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ పై నిర్ణయాన్ని పునర్ పరిశీలించి సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ కి బీఆర్ఎస్ శాసనసభ పక్షం విజ్ఞప్తి చేసింది. స్పీకర్ ను కలిసిన వారిలో హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాధవరం కృష్ణారావు, వివేకానంద, గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి వున్నారు.

Related Posts