
హైదరాబాద్
జయహే జయహే తెలంగాణ గీతం పై ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ తో పాట రూపొందించడం ఎవరికి అర్థం కాని విషయం. మన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్ లేనట్టు ఆంధ్రవారితో రూపొందించడం సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం అవుతోందని ఎమ్మెల్సీ కవిత అలన్నారు. . తెలంగాణ తల్లిని ఉద్యమ సమయంలో వేలాదిగా పెట్టుకున్నము ఆ తెలంగాణ తల్లికి గెజిట్ లేదు , జీవో లేదని తెలంగాణ తల్లిని మాములు తల్లిని చేశారు. బతుకమ్మ , బోనం ఉంటేనే ఒక ప్రత్యేకత. ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా చేశారు మెజార్టీ ప్రజలు ఒప్పుకోవడం లేదు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని జైలు గోడలు మీద రాసిన గొప్ప కవి స్వతంత్ర సమరయోధులు. దాశరతి శతజయంతి ప్రభుత్వం నిర్వహించాలి. 2కోట్ల 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది అన్నారు ఇది ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు, బీఆర్ఎస్ పాలన వల్లనే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తున్నది. కాళేశ్వరం ద్వారా ప్రతి చెరువును నింపినం. 20 వేల కోట్ల రుణమాఫీ చేసాం అన్నారు ఎన్నికల ముందు ప్రతి రైతుకు 2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పటికి అప్పు తీరక సంపూర్ణ రుణమాఫీ జరగక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 500 బోనస్ ఇచ్చామని అన్నారు ఎక్కడికి పోయిన ప్రతి రైతు బోనస్ మీద మాట్లాడాలని నా దృష్టికి తెస్తున్నారు. నాగార్జున సాగర్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పెట్టుబడులపై శ్వేత పత్రం రిలీజ్ చేయాలి. ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టమని చెబుతున్నారు మరోవైపు హైడ్రా తో విధ్వంసం చేస్తున్నారు.. బడ్జెట్ సమావేశాలు సమయం పెంచాలి. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు కావున తెలంగాణ ప్రజల మనోభావాలను అనుగుణంగా నడ్చుకోవడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మైనార్టీ లకు మంత్రులు ఉండేవారు ఈ క్యాబినేట్ లో ఎవరు లేకపోవడం బాధాకరమని అన్నారు.