
హైదరాబాద్
సోమవారం నాడు రాష్ట్ర బీఆర్ ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఇతర శ్రేణులు అసెంబ్లీ ని ముట్టడించారు. అసెంబ్లీ గేటు లో పలికి దూసుకెళ్లే ప్రయత్నం చేసారు. వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేసారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఇచ్చిన సర్క్యూలర్ రద్దు చేయాలనీ డిమాండ్ చేసారు. సామజిక ప్రజా ఉద్యమాలకు వేదికయినా ఓయూ లో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు రద్దు అనటం అన్యాయం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి దొడ్డి దారిన రావచ్చు కానీ ఓయూ విద్యార్థులు విద్య ,నిరుద్యోగ సమస్యల మీద ప్రశ్నిస్తే తప్ప అని ప్రశ్నించారు.