
హైదరాబాద్
సోమవారం ఉదయం ఓయూలో ఉద్రిక్తత నెలకొంది. ఓయూ లో నిరసనలు, ఆందోళనలు నిషేధిస్తూ ఉత్తర్వుల పై సర్కులర్ జారీ చేయడంపై విద్యార్దులు మండిపడ్డారు. ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని అన్ని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసాయి. ఓయూ విసీ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఐక్య విద్యార్థి సంఘాలు పాల్గోన్నాయి. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థుల సంఘాలు నిరసనకు దిగాయి. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో లకు తరలించారు.