
రంగారెడ్డి
రాజేంద్రనగర్ నియోజకవర్గ బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థ పరిధిలో రెండు కాలనీల మధ్య ఉన్న అడ్డుగోడను హైడ్రా అధికారులు తొలగించారు. శ్రీనివాస ఎంప్లాయిస్ కాలనీ,ఫోర్ట్యూన్ మెడోస్ కాలనీకి మధ్య గతంలో ప్రహరీ గోడను నిర్మించారు. పక్కపక్కేనే ఉన్న కాలనీలోకి వెళ్లాలంటే 3 కిలోమీటర్ల మేరకు తిరిగి పోవాల్సి వస్తుంది. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు హైడ్రా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హైడ్రా అధికారులు వెంటనే స్పందించి అట్టి ప్రహరీ గోడను జేసీబీ సహాయంతో తొలగించారు. రెండు కాలనీల మధ్య ఇంటర్నల్ కనెక్టివిటీ కోసం ప్రహరీ గోడను తొలగించినందుకు రెండు కాలనీ వాసులు హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ, హర్షం వ్యక్తం చేశారు.