
హైదరాబాద్ మార్చి 17
ఇది గాంధీ భవన్ కాదు.. అసెంబ్లీ అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సభ నిర్వహణపై ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా.. అధికార పక్షానికే ఎక్కువ సమయం కేటాయించడాన్ని ఓవైసీ తప్పుబట్టారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. సభలో మాట్లాడుదామంటే మైక్ ఇవ్వరు. అధికార పక్షం ఇలా చేయడం మంచిది కాదు. శాసనసభను నడపడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు. ప్రశ్నలు కూడా మార్చుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం. అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు అని ఎమ్మెల్యే ఓవైసీ సూచించారు.