YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైజాగ్ లో విమానాల రీ షెడ్యూల్, ఇబ్బందుల్లో ప్రయాణికులు

 వైజాగ్ లో విమానాల రీ షెడ్యూల్,  ఇబ్బందుల్లో ప్రయాణికులు
నవ్యాంధ్ర ఆర్ధిక రాజధాని విశాఖపట్నం... ఇది ఒక సుందర నగరం... ఎన్నో కంపెనీలు ఇక్కడకు వస్తున్నాయి... టూరిస్ట్ స్పాట్ గా కూడా పేరు ఉంది. ఇలాంటి విశాఖకు, ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడింది. విశాఖ ఎయిర్ పోర్ట్ కు ఇబ్బంది వచ్చే చర్యలు మొదలయ్యాయి.. కేంద్రం పెడుతున్న టార్చర్ లో, ఇది మరో రకమో ఏమో కాని, విశాఖ ఎదుగుదలకు పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. విశాఖ ఎయిర్ పోర్ట్, తూర్పు నౌకాదళం ఆధీనంలో ఉంది. విమాన రాకపోకలకు నియంత్రించే అధికారం వారికి ఉంది. ఇప్పుడు రోజుకు 5 గంటలపాటు పౌర విమానాల రాకపోకలను నిషేధించే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా అవతరిస్తున్న విశాఖ ప్రగతికి తీవ్ర ఇబ్బందికరంగా పరిణమించనుంది. ఏటా 24 లక్షల మందికి పైగా ప్రయాణికుల్ని దేశ, విదేశీ గమ్యస్థానాలకు చేరుస్తూ కీలక గుర్తింపు తెచ్చుకున్న ఈ విమానాశ్రయంలో రాకపోకలను నిషేధిస్తే ప్రయాణికులపై ఆర్థిక భారం పడటమే కాకుండా.. సమయం వృథా కానుంది.తూర్పు నౌకాదళం సారథ్యంలో నడుస్తోన్న విశాఖ విమానాశ్రయం రన్‌ వేను యుద్ధ విమానాల శిక్షణ కోసం ఉపయోగించుకోవాలని నేవీ నిర్ణయించింది. దీని కోసం రోజుకు ఐదు గంటలు పౌర విమాన సేవలు నిలిపివేయాల్సి వస్తుంది. దీనిపై గత నెలలో విమానాశ్రయం అధికారులు, విమాన సంస్థలతో నేవీ సమావేశం ఏర్పాటు చేసింది. తాము సూచించిన వేళల్లో విమానాలు నడపవద్దని కోరింది. నవంబరు ఒకటవ తేదీ నుంచి పూర్తిగా విమానాశ్రయాన్ని స్వాధీనంలోకి తీసుకుంటామని, ప్రస్తుతం నడుస్తున్న విమానాలను రీ షెడ్యూల్‌ చేసుకోవాలని నావికాదళ అధికారులు స్పష్టం చేశారు. విమానాశ్రయ సమయాలు తగ్గిస్తే విమానాలు తగ్గి రాష్ట్ర ఆర్థిక ప్రగతి, నగర అభివృద్ధి దెబ్బతినే ప్రమాదం ఉన్నప్పటికీ అటు విమానాశ్రయ అధికారులుగానీ, ఇటు నౌకాదళ అధికారులుగానీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను సంప్రదించ లేదు.భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాక దీనిని తీసుకుంటే అభ్యంతరం లేదు. కాని అక్కడ రాకముందే ఇక్కడ రాకపోకలు తగ్గించేస్తే విశాఖలో వాణిజ్య వ్యవహారాలు తీవ్రంగా దెబ్బతింటాయి. నౌకాదళ అధికారుల నిర్ణయం కారణంగా ఐటీ, ఫార్మా, పర్యాటక, ఆతిథ్య రంగాలపై తీవ్ర ప్రభావం పడి ఆర్థిక ప్రగతి దెబ్బతినడమే కాకుండా విశాఖ వచ్చే వారి సంఖ్య తగ్గి కొన్ని విమానాలు రద్దయ్యే ముప్పు ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రోజుకు 16 విమానాలు రద్దు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే విదేశీయులను ఆకర్షిస్తున్న పర్యాటక రంగంతో పాటు ఫార్మా, సీఫుడ్‌, అపెరల్‌ ఉత్పత్తులపైనా ప్రభావం పడుతుంది. ప్రస్తుతం విశాఖపట్నం జీడీపీలో దేశంలో తొమ్మిదవ స్థానంలో వుంది. నేవీ నిర్ణయం వల్ల ఈ స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది.

Related Posts