
న్యూ డిల్లీ మార్చి 17
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి, కేంద్ర మాజీ మంత్రి దేబేంద్ర ప్రధాన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 84. అనారోగ్యం కారణంగా సోమవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలుపుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం దేబేంద్ర ప్రధాన్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.