
హైదరాబాద్
సుప్రీంకోర్టులో ఒక్కొక్కరిగా అఫిడవిట్ దాఖలు చేస్తున్న పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, మేము పార్టీ మారలేదు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాము.. మీడియా దాన్ని వక్రీకరించి మేము పార్టీ మారినట్టుగా చూపించింది అంటూ సుప్రీంకోర్టులో ఒక్కొక్కరిగా అఫిడవిట్ దాఖలు చేస్తున్న పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఇప్పటి వరకు జరిగిన వాదనలు చూస్తే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రూట్ మార్చి మేము పార్టీ ఫిరాయించలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే, అయితే సుప్రీంకోర్టులో మాత్రం నేను పార్టీ ఫిరాయించలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం, బీఆర్ఎస్ పార్టీతో నాకు మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. శాసనసభకు మూడోసారి ఎన్నికయ్యక వ్యక్తిగత స్థాయిలో ముఖ్యమంత్రిని కలిశానని, పార్టీ మారలేదు అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాకి చెందిన ఎమ్మెల్యేలు సైతం ఈ విధంగానే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన ఈ అఫిడవిట్ లపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.