YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అబద్దాల్లో, అంకెల్లో, అప్పుల్లో, దోపిడీలో బీఆర్ఎస్.. సర్కార్ ను.. మించిన కాంగ్రెస్..

అబద్దాల్లో, అంకెల్లో, అప్పుల్లో, దోపిడీలో బీఆర్ఎస్.. సర్కార్ ను.. మించిన కాంగ్రెస్..

హైదరాబాద్
6 గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ తీరు 
కేటాయింపులకు ఆచరణకు పొంతనే లేని బడ్జెట్
మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను కూడా అమలు చేయలేని అసమర్ధ సర్కారని తేలిపోయింది.
విద్య, వైద్య రంగాల కేటాయింపులు దారణం,
అభయ హస్తం కాదు మహిళల పాలిట శూన్య హస్తమని నిరూపించిన బడ్జెట్,
2 లక్షల ఉద్యోగాల భర్తీ, రూ.4 వేల నిరుద్యోగ భ్రుతి ఊసేలేదు
వ్రుద్దుల పెన్షన్ పెంపును గాలికొదిలేసిన బడ్జెట్
విద్యార్థుల భవిష్యత్తును చిదిమే బడ్జెట్ ఇది.
రైతుకిచ్చిన హామీలన్నీ హుష్ కాకి
గోబెల్స్ ను మించిన అబద్దాల కోరులు కాంగ్రెస్ నేతలు
ఇచ్చిన హామీలను నెలబెట్టుకునే మోదీ సర్కార్ తో గోబెల్స్ ను మించి అబద్దాలు కోరు కాంగ్రెస్ కు పోలికా?
రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ను పరిశీలిస్తే.. డొల్ల అని తేలిపోయింది ముఖ్యంగా గత బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులను పరిశీలిస్తే పొంతనే లేదని తేలిపోయింది.  అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు పెంచి తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేసేందుకు బడ్జెట్ ను సాధనంగా ఉపయోగించుకోవడం సిగ్గు చేటు. పైగా 10 సార్లు చెబితే అబద్దమే నిజమైతుందనే నానుడిని బడ్జెట్ లో ప్రస్తావించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అదే ఒరవడిని కొనసాగించడం సిగ్గు చేటు, ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు, ఆచరణకు ఏమాత్రం పొంతన లేని బడ్జెట్ ఇది. 6 గ్యారంటీలను పూర్తిగా తుంగలో తొక్కేశారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పేర్కొన్న కాంగ్రెస్ నేతలు అదికారంలోకి వచ్చాక చిత్తు కాగితంగా మార్చినట్లు ఈ బడ్జెట్ ద్వారా వెల్లడైంది. మొత్తంగా బడ్జెట్ తీరును విశ్లేషిస్తే అబద్దాలు అంకెల గారడీ 6 గ్యారంటీలకు పాతరేసేలా రాష్ట్ర బడ్జెట్ ఉంది. ఓం భూం బుష్ అంటూ మాయ చేసేందుకే ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం భారీగా పెరిగినట్లు బడ్జెట్ లో గొప్పలు చెప్పిన ప్రభుత్వం. అప్పుల వివరాలను కూడా బడ్జెట్ లో పొందుపరిచి ఒక్కో తెలంగాణ పౌరుడిపైనా, చివరకు పుట్టబోయే బిడ్డపైనా ఎంత అప్పు భారం ఉందో వాస్తవాలను వివరిస్తే బాగుండేది.
దోపిడీలో కేసీఆర్ ప్రభుత్వాన్ని మించిపోయినట్లు కన్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా 6 గ్యారంటీల అమలు కోసం ఈ బడ్జెట్ లో కేటాయింపులను చేసేలా సవరణలు చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రవేశపెట్టిన బడ్టెట్ కేటాయింపులకు, వాస్తవిక ఖర్చు వివరాలతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది బడ్జెట్ కేటాయింపులు, వాస్తవిక ఖర్చు వివరాలను ప్రజల ముందుంచాలని కోరుతున్నాం.

Related Posts