
బీజూపూర్
మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ - దంతేవాడ జిల్లా సరహిద్దులో జరిగిన ఎన్కౌంటర్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ - దంతేవాడ జిల్లా సరిహద్దులోని గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్కు జాయింట్ టీమ్ బయలుదేరింది. ఆపరేషన్ సమయంలో భద్రతబలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో గురువారం ఉదయం 7 గంటల నుంచి మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య నిరంతర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మరణించగా, ఘటనస్థలంలో భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి.