ఏపీలో ఏం జరుగుతుంది. ఎవరిపై ఎవరు పై చేయి సాధిస్తారు. ఎవర్ని ఎవరు ముప్పుతిప్పలు పెడతారు. అసలేం జరుగుతోంది… నాయకులకే తెలియని జవాబులివి. ఇప్పటికే హీటెక్కిన పాలిటిక్స్‌లో రామాయణంలో పిడకలవేట.. మరో కొత్త పార్టీ.. ఎవరతడు. ఎక్కడ నుంచి వస్తాడని ఆలోచించినపుడు.. వినిపించిన పేరు.. లక్ష్మినారాయణ. సీనియర్ ఐపీఎస్ అధికారి.. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్. ఇంకా.. పదేళ్ల సర్వీసు ఉన్నా.. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని బయటకు వచ్చారు. ఓ విధంగా.. మహారాష్ట్ర కేడర్‌లో ఐపీఎస్ సాధించిన ఆయన.. ఏకంగా డీజీ వరకూ చేరే అవకాశాలున్నాయి. కాదు. సీబీఐలోనే కొనసాగితే.. డైరెక్టర్ హోదాకు చేరేవారు. కానీ.. అకస్మాత్తుగానో.. లేకపోతే.. ఎప్పటి నుంచో ఉన్న ప్లాన్ ప్రకారం కావచ్చు.. ఈ మధ్యనే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని.. బయటపడ్డారు.ఆయనిలా రాగానే.. ఐపీఎస్‌కు ఆయన కుమారుడు ఎంపికయ్యాడు. ఇదంతా యాదృచ్ఛికమే అయినా.. లక్ష్మినారాయణ ఎందుకు కొలువు వద్దనుకున్నారు. దీని వెనుక ఏముంది అనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్. బీజేపీ తోడ్పాటుతో కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు ఓ వైపు.. లేదు.. టీడీపీ, జనసేనతో కొనసాగుతారనే రూమర్లు మరోవైపు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మధ్య పవన్ వైపు మొగ్గుచూపుతున్నట్లు.. జనం ప్రశ్నించే స్థాయికిచేర్చటంలో పవన్ సక్సెస్ అన్నారు. అదే సమయంలో తాను ఏ రాజకీయ పార్టీకు మద్దతు చెప్పట్లేదన్నారు. ఇటువంటి సమయంలో చంద్రబాబు కూడా. లక్ష్మినారాయణపై విమర్శనాత్మకంగా.. వ్యంగాస్తాలు విసిరారు. దీంతో.. జనసేన, టీడీపీలోకి రావటం కల్ల అనేది తేలినట్టే. అయితే లక్ష్మణ్న మాత్రం.. తాను ప్రజా సమస్యలు.. ముఖ్యంగా రైతుల ఇబ్బందులు.. వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై ఫోకస్ చేసేలా.. తోడ్పాటును అందించేలా వేదిక ఏర్పాటు చేస్తానంటున్నాడు. దీనికి ఓ విధంగా లోక్‌సత్తా జేపీ స్పూర్తి కావచ్చు. ఆయన కూడా.. గతంలో ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి లోక్‌సత్తాతో జనం సమస్యలపై పోరాటం చేశారు. అనంతరం కొత్త రాజకీయాలకు వేదిక అంటూ దాన్ని రాజకీయ పార్టీగా మార్చారు. 2009లో కూకట్‌పల్లి నుంచి ఒక్కరే గెలిచారు. మరోసారి పోటీ నుంచి తప్పుకున్నారు. ఇటీవల జనసేనతో మళ్లీ కలసి.. రాజకీయంగా బయటకు వస్తారనుకున్నా.. కలవని మనసులు.. జేపీను మౌనంగా మార్చాయి.మరి.. కళ్లెదుట ఇన్ని కనిపిస్తుంటే.. జేడీ లచ్చన్న కూడా.. జేపీ బాటను ఎంచుకోవటం ఆశ్చర్యమే. అయతే. దీనిపై స్పష్టత వచ్చేంత వరకూ లక్ష్మినారాయణ చెప్పింది నిజమా కాదా అనేది సస్సెన్స్.