YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కల్లలవుతున్న డాలర్ డ్రీమ్స్...

కల్లలవుతున్న డాలర్ డ్రీమ్స్...

హైదరాబాద్, మార్చి 27, 
కల్లలవుతున్న డాలర్ డ్రీమ్స్.. ఏ క్షణాన్నయినా ఏ కార్డయినా.. రద్దయే ప్రమాదం..! ఎఫ్‌1 వీసాదారుల కష్టాలు ఇలా ఉంటే.. ఉద్యోగం చేస్తూ H1B వీసాలు తీసుకుని స్థిరపడ్డ తెలుగోళ్ల పరిస్థితి మరింత అగమ్యగోచరం. అమెరికాలో జారీ అయ్యే హెచ్‌1బీ వీసాల్లో 78 శాతం మనోళ్లవే. తర్వాత గ్రీన్‌కార్డు తెచ్చుకోడానికి దీన్ని ప్రధాన ఆధారంగా వాడుకుంటారు. ప్రస్తుతం 3 లక్షల 20 వేల మంది భారతీయులు హెచ్‌1బీ వీసాతో అమెరికాలో ఉంటున్నారు. కానీ.. ట్రంప్ సెకండ్ టర్మ్ స్టార్టయ్యాక వీళ్లక్కూడా సినిమా కష్టాలు స్టార్టయ్యాయి. ఉద్యోగాలకు భద్రతన్నదే కరువైపోయింది.ఇమ్మిగ్రేషన్ చట్టాలు కఠినతరం, ఊడుతున్న ఉద్యోగాలు, అక్రమ వలసదారుల ఏరివేత, ప్రత్యేక విమానాల్లో పంపివేత, అమెరికా సరిహద్దు గోడ దూకుతూ భారతీయుడి మృతి..! అగ్రరాజ్యంలో మనోళ్ల సినిమా కష్టాలపై ఇలా వరుసబెట్టి వస్తున్న వార్తలకు పరాకాష్ట ఏంటంటే.. అమెరికాలో అప్పుల బాధ తట్టుకోలేక, మానసిక ఒత్తిడి భరించలేక గుడివాడ విద్యార్థి ఆత్మహత్య. మనోళ్ల డాలర్ డ్రీమ్స్‌ బద్దలైపోతున్నాయనడానికి ఇంతకంటే లైవ్ ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి? టౌన్ పక్కకెళ్లొద్దురా.. డౌనైపోతావురా అని నెత్తీనోరూ బాదుకున్నా ఎవ్వరి చెవికీ ఎక్కలేదు. ఏ బంగారు సామీ విన్న పాపాన పోలేదు. మెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ 2.0 పాలనలో దూకుడు, స్పీడ్‌తో ప్రపంచ దేశాలతోపాటు అమెరికన్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఖర్చు తగ్గింపు పేరుతో అమెరికన్లను, మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ పేరుతో విదేశీయులను ఇబ్బంది పెడుతున్నాడు. అక్రమ వలసదారులను దేశం దాటిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు కఠినతరం చేశారు. ఇక ఇప్పుడు వీసాల్లో కోత పెడుతున్నారు. తాజాగా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనే కల చాలామంది విద్యార్థుల సొంతం. అందులోనూ అమెరికా వంటి అగ్రరాజ్యంలో చదువుకోవాలని ఆశపడేవారు ఎక్కువ. ఏటా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ లక్ష్యంతో అమెరికా బాట పడుతుంటారు. అయితే, గత కొంతకాలంగా అమెరికా ప్రభుత్వం విద్యార్థి వీసాలు (F–1)పై కఠిన వైఖరి అవలంబిస్తూ వీసా జారీల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 41% వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి, ఇది గత దశాబ్దంతో పోలిస్తే దాదాపు రెట్టింపు.అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం, 2023–24లో 6.79 లక్షల F–1 వీసా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 2.79 లక్షలు (41%) తిరస్కరించబడ్డాయి. 2022–23లో 6.99 లక్షల దరఖాస్తుల్లో 2.53 లక్షలు (36%) ఆమోదం పొందలేదు. దీనికి భిన్నంగా, 2013–14లో 7.69 లక్షల దరఖాస్తుల్లో 1.73 లక్షలు (23%) మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి. ఈ గణాంకాలు వీసా తిరస్కరణ రేటు గత పదేళ్లలో రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగిందని స్పష్టం చేస్తున్నాయి.భారతీయ విద్యార్థుల విషయంలోనూ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 2024 తొలి 9 నెలల్లో F–1 వీసాల జారీ 38% తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జనవరి నుంచి సెప్టెంబరు వరకు కేవలం 64 వేల మందికి వీసాలు మంజూరయ్యాయి, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 1.03 లక్షలుగా ఉంది. కొవిడ్‌ తర్వాత భారతీయ విద్యార్థులకు వీసాలు ఇంతగా తగ్గడం ఇదే మొదటిసారి.
F–1 వీసా అంటే ఏమిటి?
ఇది నాన్‌–ఇమిగ్రెంట్‌ వీసా, అమెరికాలో ఫుల్‌–టైమ్‌ విద్య కోసం విదేశీ విద్యార్థులకు అనుమతినిస్తుంది. అమెరికా విద్యాసంస్థలు ఏటా రెండు సెమిస్టర్‌లలో (ఆగస్టు–డిసెంబర్, జనవరి–మే) ప్రవేశాలు కల్పిస్తాయి. భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఆగస్టు సెమిస్టర్‌లో వెళ్తారు. అయితే, కఠిన వీసా విధానాలతో ఈ కలలు కల్లలవుతున్నాయి. ఈ తిరస్కరణల వెనుక అక్రమ వలసలను అరికట్టడం, వీసా నిబంధనలను కఠినతరం చేయడం వంటి కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, విద్యార్థులు ఆర్థిక స్థిరత్వం, సరైన డాక్యుమెంటేషన్, చదువు తర్వాత స్వదేశం తిరిగి వెళ్లే హామీని స్పష్టంగా చూపించాల్సి వస్తోంది.అమెరికా టౌన్ మీద మోజు పెంచుకుని.. చదివితే అక్కడే చదవాలని ఉద్యోగం చేస్తే అక్కడే చెయ్యాలని అప్పుడు కన్న డాలర్ డ్రీమ్స్‌ ఇప్పుడు ఒక్కటొక్కటిగా బద్దలైపోతున్నాయి. ఎదర బతుకంతా చిందరబందరే అని జ్ఞానోదయాలయ్యాక నిద్ర మత్తు వదిలించుకుని కొద్దికొద్దిగా రియాలిటీలోకి వస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ చట్టాల్ని చించిపారేసి కొత్తకొత్త రూళ్ల కర్రతో బాదేస్తున్న ట్రంప్ ఐడియాలజీ మనోళ్ల ప్రాణాల మీదికొస్తోంది. అమెరికా ఆశల్లో తేలియాడిన లక్షలాదిమంది భారతీయులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. బెటర్ ఎడ్యుకేషన్, బెటర్ లివింగ్ కండిషన్లు, బెటర్ మనీ, బెటర్ ఆపర్చునిటీస్ కోసం మనోళ్లు ఆశగా చూసే దేశాలు యూకే, యూఎస్. ఆస్ట్రేలియా, కెనడా. ఏటా 13 లక్షల మంది భారతీయులు విదేశాలకు వెళ్తుంటే.. అందులో మన తెలుగువాళ్లే ఎక్కువ. ఆ తెలుగువాళ్లలో కూడా అమెరికా టూరేసేవాళ్లే ఎక్కువ. ఇప్పుడు అమెరికాలోనే వీళ్ల ఆశలన్నీ అడ్డం..

Related Posts