YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పోలీసులకు చిక్కిన లేడీ డాన్

పోలీసులకు చిక్కిన లేడీ డాన్

హైదరాబాద్, మార్చి 27, 
గంజాయిని సరఫరా చేస్తూ ఒక లేడీ డాన్ మూడు రాష్ట్రాలను ముప్పుతిప్పలు పెడుతుంది. చివరకు హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు లేడీ డాన్ సంగీత సాహును అరెస్ట్ చేశారు. ఒడిశాకు చెందిన సంగీత సాహు గంజాయిని అనేక మందికి సరఫరా చేస్తూ లక్షల రూపాయలను ఆర్జించారు. నాలుగేళ్ల నుంచి ఈ గంజాయి వ్యాపారంలోకి దిగిన లేడీ డాన్ సంగీత సాహు ఒడిశాతో పాటు తెలంగాణ రాష్ట్రాలలో అనేక మందికి గంజాయిని సరఫరా చేస్తుంది. రెండు చేతులా సంపాదిస్తుంది. పోలీసులకు చిక్కకుండా ఇన్నాళ్లు తప్పించుకుంది. గతంలో అనేక సార్లు సంగీత సాహు పోలీసులకు రికార్డులకు ఎక్కినప్పటికీ ఆమెపై పోలీసులు ఒక కన్నేశారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని గంజాయి వ్యాపారులతో టచ్ లో ఉండి వారికి సరఫరా చేస్తూ లక్షలు సంపాదిస్తూ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడింది.  ఒడిశా రాష్ట్రంలోని కుర్ధా జిల్లాలోని కాళీకోట్ గ్రామానికి చెందిన సంగీత సాహు భువనేశ్వర్ కు దగ్గరగా ఉండటంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులతో సులువుగా గంజాయి వ్యాపారాలను యధేచ్ఛగా నిర్వహిస్తుంది. పోలీసుల కళ్లు కప్పి తప్పించుకుతిరుగుతూ వారిని ముప్పు తిప్పలు పెడుతుంది. అనేక మార్గాల ద్వారా గంజాయిని సరఫరా చేస్తూ వెంటనే తన అనుచరుల ద్వారా డబ్బును తెప్పించుకోవడం సంగీత సాహుకు అలవాటు. ఈ విషయం తెలిసిన పోలీసులు, ఎక్సైజ్ శాఖ సంగీత సాహు కార్యకలాపాలపై ఒక కన్నేసి ఉంచారు. వివిధ రాష్ట్రాల గంజాయి వ్యాపారులతో ఫోన్ లోనే బేరాలు మాట్లాడుకుని వారికి యధేచ్ఛగా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు అయితే తాజాగా హైదరాబాద్ లోని ధూల్ పేట్ లో గంజాయి వ్యాపారులకు 41.3 కేజీల గంజాయిని సరఫరా చేస్తూ సంగీత సాహు పట్టుబడటంతో ఈమె వెలుగులోకి వచ్చింది. ధూల్ పేట్ లో కొందరు వ్యాపారులకు గంజాయిని సరఫరా చేసినట్లు తెలియడతో పాటు గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే సంగీత సాహుపై ఐదు కేసులు నమోదయ్యాయి. ఇక మిగిలిన రాష్ట్రాల్లో కూడా అనేక కేసులున్నాయి. అయితే సంగీత సాహును అరెస్ట్ చేయడానికి ఒడిశాకు వెళ్లిన ఎక్సైజ్ శాఖ పోలీసులు అక్కడి పోలీసుల సహకారంతో అరెస్ట్ చేసి నగరానికి తీసుకు వచ్చారు. సోషల్ మీడియాలో వీడియోలు పోస్టులు చేస్తూ గంజాయి వ్యాపారాన్ని యధేచ్ఛగా నిర్వహిస్తున్న ఈ కిలాడీ లేడీ ఎట్టకేలకు కటకటాలపాలయింది.

Related Posts