
సికింద్రాబాద్..
ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ భౌతిక కాయాన్ని సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో సందర్శకుల అభిమానుల సందర్శనార్థం ఉంచారు. సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ కు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున పాస్టర్లు తరలివచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మరణం క్రైస్తవ లోకానికి తీరని లోటని అన్నారు. అనుమానాస్పద స్థితిలో ఆయన మృతి చెందడం క్రైస్తవ సమాజాన్ని తీవ్రంగా కలచివేసిందని అన్నారు. కొంతమంది మతోన్మాద శక్తులు ఆయనను హతమార్చాయని ఆరోపించారు. సువార్త చెప్పేందుకు వెళ్తున్న ఆయనపై దాడి చేసి హతమార్చి రహదారి ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపించారు. ఇలాంటి ఘటనల మూలంగా దేశంలో శాంతి భద్రతలు దెబ్బ తినడంతో పాటు క్రైస్తవులకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు. వెంటనే బాధ్యులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకొని పగడాల ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ తెలుగు రాష్ట్రాల పాస్టర్లు డిమాండ్ చేశారు. అభిమానుల సందర్శన అనంతరం పర్యటమైదానంలోని సెయింట్ జాన్స్ సిమెట్రీలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.