YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పదివేల మంది తో మరోసారి రామోజి ఫిల్మ్ సిటీనీ ముట్టడిస్తం

పదివేల మంది తో మరోసారి రామోజి ఫిల్మ్ సిటీనీ ముట్టడిస్తం

రంగారెడ్డి
రామోజీ ఫిల్మ్ సిటీని మరోసారి ముట్టడిస్తామని సీపీఎం నేతలు ప్రకటించారు. గురువారం ఉదయం పొల్కంపల్లి లో రామోజి యాజమాన్యం దిష్టి బొమ్మ దహనంచేసారు. బుధవారం  రామోజి ఫిల్మ్ సిటీ శాంతి యుతంగా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చలో రామోజి ఫిల్మ్ సిటీ ముట్టడి చేసినా సీపీఎం నేతలు లను ఆరెస్ట్ లను నిరసిస్తూ గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం  పొల్కం పల్లి గ్రామంలో రామోజీ యాజమాన్యం దిష్టి బొమ్మ ను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా క్రితం పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం చెందారు.  రామోజీ యాజమాన్యం భూమిని  కబ్జా చేసి చుట్టూ పెద్ద గోడలు కట్టి లబ్ధి దారులు రాకుండా అడ్డుకుంటుదని  అన్నారు. ఈ రోజు ఆన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతున్నమని అన్నారు.పోలీసులు రామోజీ యాజమాన్యం కు తొత్తులుగా వ్యవహరిస్తున్న రని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎంఎల్ఏ మల్ రెడ్డి రంగారెడ్ది ఎన్నికలు ముందు గ్రామాల్లో ప్రచారం కోసం వచ్చిన సందర్భంగా ఫిల్మ్ సిటీ ఇంటి స్థలాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎంఎల్ఏ నోరు మెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Related Posts

To Top