YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నానికి గుండె సంబంధిత సమస్యలు

నానికి గుండె సంబంధిత సమస్యలు

విజయవాడ
మాజీ మంత్రి, గుడివాడ మాజీ శాసనసభ్యులు కొడాలి వెంకటేశ్వర్రావు(నాని)కి హృద్రోగ సమస్యలున్నాయని వైద్యులు నిర్ధారించారు. కొన్నిరోజులుగా వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనికి గుండె సంబంధిత సమస్యలున్నట్టు, మూడు వాల్వ్స్ బ్లాక్ అయినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఆపరేషన్కూడా చేయాల్సి ఉంటుందని  వైద్యులు చెప్పారని గుడువాడ వైకాపా నేత దుక్కిపాటి శశి భూషన్ వెల్లడించారు. బంధువులు, సన్నిహితులు, గుడివాడలో పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతారనే ఉద్దేశంతో కొడాలి నాని ఈ విషయాన్ని మాకు వెల్లడించలేదు. మాజీ సీఎం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైయస్.జగన్మోహన్రెడ్డి  డాక్టర్లతో మాట్లాడి, నానికి ఉన్న అనారోగ్యంపై వాకబు చేయడంవల్ల, నానికి హృద్రోగ సమస్యలున్నట్టుగా మాకు తెలిసింది. ఈ విషయం తెలియక నిన్న మీడియా మిత్రులకు ప్రకటన విడుదలచేశాను. కొడాలి నానికి అందిస్తున్న చికిత్స విజయవంతం కావాలని, వెంటనే కోలుకోవాలని ఆయన సన్నిహితులు, గుడివాడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారని అన్నారు.

Related Posts