YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డిలకు ముందస్తు బెయిల్

సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డిలకు ముందస్తు బెయిల్

విజయవాడ, మార్చి 28, 
సజ్జల రామకృష్ణారెడ్డి,ఆయన కుమారుడు సజ్జల  భార్గవరెడ్డి ముందస్తు బెయిల్ పొందారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇటీవల పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రైల్వే కోడూరు పోలీసులకు తను మాట్లాడిన మాటలు, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై  ఉపయోగించిన భాష అంతా   సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి ప్రోద్భలం వల్లనే మాట్లాడానని నేరం అంగీకరిస్తూ వాంగ్మూలం ఇచ్చారు. దీంతో తమనూ అరెస్టు చేసే అవకాశం ఉందని  భావించి వీరిద్దరూ కోర్టును ఆశ్రయించారు. తమకు ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యాలని కోరారు. వారి పిటిషన్ ను విచారించిన హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో నమోదు చేసిన కేసులో అరెస్ట్ చేస్తారన్న ఆందోళన ఉందని వారు కోర్టులో వాదించారు.  తాము అమాయకులమని, తమను అనవసరంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న పోసాని తమ పేర్లను వాంగ్మూలంలో చెప్పారని, అది తప్ప ఇందులో తమ పాత్ర ఉందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు దృష్టికితీసుకెఎల్లారు.  రాజకీయ ప్రతీకారంతో తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.  గుంటూరు జిల్లాలో, పులివెందులలో తమకు శాశ్వత నివాసాలు ఉన్నాయని, తప్పించుకుపోయే ప్రశ్నే లేదని, అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరవుతామని అన్నారు. కాబట్టి తమను ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోర్టులో కోరారు. ఈ మేరకు కోర్టు బెయిల్ మంజరు చేసింది. వైసీపీ అధికారంలో ఉండగా  చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లపై  ప్రెస్ మీట్ లు పెట్టి  రాయలేని భాషలో దుర్భాషలాడారు పోసాని. కూటమి అధికారం లోకి రాగానే తాను ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించి సైలెంట్ అయిపోయారు పోసాని. అయితే గతంలో  ఆయన వాడిన భాష తమ మనోభావాలు దెబ్బతీసాయి అంటూ  కంప్లైంట్స్ రావడం తో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అయితే సజ్జల చెబితేనే  తాను అలా తిట్టాను అంటూ పోసాని పోలీసులు ముందు ఒప్పుకున్నారు.వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలను సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డి నిర్వహించారు. అప్పటి సోషల్ మీడియా యాక్టివిస్టులు, అందరు ఫ్రీ లాన్స్ జర్నలిస్టులు, వైసీపీకి అనుకూలంగా పనిచేసిన యూట్యూబర్లు భార్గవ్ రెడ్డి కనుసన్నల్లోనే పనిచేసేవారని అప్పటి ప్రతిపక్షమైన టిడిపి జనసేన పార్టీల నేతలు కార్యకర్తలపై  సోషల్ మీడియాలో చెప్పలేని భాషతో విరుచుకుపడింది భార్గవ్ రెడ్డి  సూచనలతోనే అని టిడిపి జనసేన నాయకులు ఆరోపిస్తూ ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ  వాటిని దృష్టిలో పెట్టుకుని తమను అరెస్టు చేసే దిశగా నడుస్తున్నాయని భావించిన భార్గవ్ రెడ్డి ,అయన తండ్రి సజ్జల ముందస్తు బెయిల్ పొందారు.

Related Posts