YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొరకుగాని కొ్య్యలా మారుతున్న అధికారులు

కొరకుగాని కొ్య్యలా మారుతున్న అధికారులు

తిరుపతి, మార్చి 28, 
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత వైసీపీ హాయంలో పనిచేసిన అఖిల భారత సర్వీసు అధికారులు ఆ పార్టీ కార్యకర్తల్లా పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా వారు కూటమి ప్రభుత్వం అంటే లెక్క లేనట్లు వ్యవహరిస్తున్నారని టిడిపి నేతలు సీరియస్ అవుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ పరిస్థితి దారుణంగా ఉందని నాయకులు వాపోతున్నారట. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వ్యవహారిస్తున్న తీరుతో అసలేం జరుగుతుందో అంతుపట్టడం లేదని క్యాడర్ వాపోతోంది. సీఎం వచ్చినప్పుడు మాత్రం తల ఊపి తర్వాత తమదైన రీతిలో ఇష్టానుసారం వ్యవహారిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. సీఎంఓలోని కొంతమంది అధికారుల సహకారంతో వారు ఆడింది అట పాడింది పాటగా తయారైందంట.చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తీరుపై బహిరంగంగా విమర్శలు చేసారు మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకుడు, పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి. పుంగనూరులో టిడిపి కార్యకర్త రామకృష్ణను వైసీపీ కార్యకర్తలు, నాయకులు కలసి హత్య చేశారు. దానిపై అమర్‌నాథ్ మదనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ ఇప్పటికి వైసీపీ తొత్తులుగా ఉన్న పోలీసులను కొనసాగిస్తున్నారని విమర్శించారు. దాన్ని మనసులో పెట్టుకొని ఎస్పీ ఏకంగా వందలాది పోలీసులను ఇష్టానుసారం బదిలీలు చేసారని తాజాగా అమర్నాథ్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి అనుకూలంగా ఉన్న వారిని బదిలీ చేయమంటే అందరిని బదిలీ చేసి వారి పెళ్ళాం పిల్లల చేత తనను తిట్టిస్తున్నారని మండిపడ్డారు.బదిలీల సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధుల ఇచ్చిన సిఫార్సులను బుట్ట దాఖాలు చేసారట. క్షేత్ర స్థాయిలో డిఎస్పీ, సీఐలను కనీసం వారి గురించి ఏమాత్రం డేటా తీసుకోకుండా నాలుగు సంవత్సరాలు, ఐదు సంవత్సరాల స్టాండింగ్ పేరుతో బదిలీ చేశారని, దాంతో పాటు మహిళ పీఎస్‌లో రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్న వారిని తీసుకెళ్ళి సమస్యాత్మక స్టేషన్‌లకు పంపారంట. మొత్తం మీదా కావాలనే టిడిపికి చెడ్డ పేరు వచ్చే విధంగా అయన చేశారని అంటున్నారు.జిల్లాలో రెవెన్యూతో పాటు ఇతర శాఖలలో కూడా ఇదే పరిస్థితి ఉందంట. గత ప్రభుత్వంలో కీలక శాఖలలో కొనసాగిన వారికి ఇన్ చార్జ్ బాధ్యతలు ఇచ్చి కొనసాగిస్తున్నారంట. గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తికి కీలక బాధ్యతలు ఇచ్చారని ఒక ఎమ్మెల్యే సీఎంఓ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంట. అదే విధంగా తిరుపతి నగరపాలక సంస్థలో కమిషనర్ కూటమి నేతలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసారట. గతంలో డిప్యూటేషన్ పై వచ్చిన నగర పాలక సంస్థ డిప్యూటి కమిషనర్‌ను బదిలీ చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నా ఏమాత్రం పట్టించుకోకుండా కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.అన్నమయ్య జిల్లాలో జిల్లా జాయింట్ కలెక్టర్ కూటమి నేతలకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదంటున్నారు. తంబల్లపల్లి, మదనపల్లిల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు దందాలకు పాల్పడుతున్నారనే అరోపణలు ఉన్నాయి. తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటు కొంతమంది అధికారుల తీరుతో విసిగి పోతున్నామని కార్యాకర్తలు వాపోతున్నారు. వారందరు సిఎంఓ తమకు అండగా ఉందని అంటున్నారట. నాయకుడు ఎవరైనా ప్రశ్నిస్తే సిఎంఓలోని ఓ అధికారి పేరు చెబుతున్నారంట. గతంలో తిరుపతి నగర పాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ ఎంపికలో టిడిపికి చెందిన న్యాయవాదికి కాకుండా మరో వ్యక్తి కి ఇవ్వడానికి ప్రయత్నించారు. అప్పుడు నిలదీస్తే కమిషనర్ సిఎంఓలోని ఒక అధికారి పేరు చెప్పి బెదిరించారంట.గతంలో డిప్యూటేషన్ మీద వచ్చిన అర్డీఓలను యధావిధిగా కొనసాగిస్తున్నారు. వారంత వైసీపీ సానుభూతిపరులన్న ఆరోపణలున్నాయి. చివరకు పదవి విరమణ పొందిన అధికారిని సైతం సలహాదారుగా కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో డిప్యూటేషన్ పై వచ్చిన వారిని బయటకు పంపడానికి మీనామేషాలు లెక్కిస్తున్నారట. మొత్తం మీద ఎన్నికలలో తాము కష్ట పడి పనిచేసామా? లేకా అఖిల భారత సర్వీసు అధికారులు పనిచేసారా అని నాయకులను కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారట. మరో వైపు గత 9నెలలుగా జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై సీనియర్ నాయకులు గళం విప్పడానికి సిద్ధమవుతున్నారట. అత్మాభిమానం చంపుకుని అధికారుల పెత్తనంలో బతకడం కంటే రాజకీయాలకు దూరం కావడం మేలని చాలామంది సీనియర్ కార్యకర్తలు, పార్టీ అవిర్బావం నుంచి పనిచేసిన వారు అభిప్రాయపడుతున్నారు.

Related Posts