
మయన్మార్, థాయ్ ల్యాండ్ దేశాలలో శుక్రవారం భారీ భూకపం సంబవించింది.
రిక్టర్ స్కేల్ మీద ఈ తీవ్రత 7.7 గా నమోదైంది.. ఈ భూకంపం ధాటికి ఆయా దేశాలలో బారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం.. దీని తీవ్రతకు పలు భవనాలు కుప్పకూలాయి. ప్రజలు ఇళ్ల నుంచి భయంతో పరుగులు తీశారు.. మరికొందరు ప్రాణాలు రక్షించేందుకు ఈల కొలనులలో దూకారు.. ఇక బ్యాంకాంక్ లో ఈ భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. ఈ నగరంలో అనేక భవనాలు నేలమట్టమైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది.. సహాయ కార్యక్రమాల కోసం సైన్యాన్ని రంగంలోకి దించారు.. వందలాది మంది క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు.. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.. కాగా, ఈ దేశాలలో ముందు జాగ్రత్త చర్యలుగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.