
హైదరాబాద్, మార్చి 29,
దీర్ఘకాలంలో బంగారం దిగుమతిపై దేశం ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు ఉత్పాదక ప్రయోజనాల కోసం దాని వినియోగాన్ని సులభతరం చేయడానికి దేశంలోని గృహాలు, సంస్థల వద్ద ఉన్న బంగారాన్ని సమీకరించడం కోసం సెప్టెంబర్ 15, 2015న గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌ను ప్రకటించింది. సాధారణంగా జీఎంఎస్ 3 భాగాలను కలిగి ఉంటుంది. స్వల్పకాలిక బ్యాంక్ డిపాజిట్ (1-3 సంవత్సరాలు), మధ్యకాలిక ప్రభుత్వ డిపాజిట్ (5-7 సంవత్సరాలు), దీర్ఘకాలిక ప్రభుత్వ డిపాజిట్ (12-15 సంవత్సరాలు)గా విభజించారు.గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ పనితీరు, మారుతున్న మార్కెట్ పరిస్థితుల పరిశీలన ఆధారంగాచి జీఎంఎస్‌కు సంబంధించిన మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ భాగాలను నిలిపివేయాలని నిర్ణయించామని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జీఎంఎస్ కింద బ్యాంకులు అందించే స్వల్పకాలిక బ్యాంక్ డిపాజిట్లు ఆయా బ్యాంకుల అభీష్టానుసారం కొనసాగుతాయని పేర్కొంది. అయితే ఈ స్కీమ్ అమలు విషయంలో రిజర్వ్ బ్యాంక్‌ను సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలు అనుసరించాల్సి ఉంటుంది. మార్చి 26, 2025 నుంచి జీఎంఎస్‌కు సంబంధించిన ఎంఎల్‌టీజీడీ భాగాల కింద నియమించబడిన కలెక్షన్ అండ్ ప్యూరిటీ టెస్టింగ్ సెంటర్ (సీపీటీసీ) లేదా జీఎంఎస్ మొబిలైజేషన్, కలెక్షన్ అండ్ టెస్టింగ్ ఏజెంట్ (జీఎంసీటీఏ) లేదా నియమించిన బ్యాంక్ శాఖల్లో టెండర్ చేసిన ఏవైనా బంగారు డిపాజిట్లు అంగీకరించమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.ఎంఎల్‌టీజీడీ కింద ఉన్న డిపాజిట్లు జీఎంఎస్‌కు సంబంధించిన ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం రిడెంప్షన్ వరకు కొనసాగుతాయి. నవంబర్ 2024 వరకు మొత్తం 31,164 కిలోల బంగారంలో స్వల్పకాలిక బంగారు నిక్షేపాలు 7,509 కిలోలు, మధ్యకాలిక బంగారు నిక్షేపాలు 9,728 కిలోలు, దీర్ఘకాలిక బంగారు నిక్షేపాలు 13,926 కిలోలు ఉన్నాయి. జీఎంఎస్‌లో దాదాపు 5,693 మంది డిపాజిటర్లు పాల్గొన్నారు. జనవరి 1, 2024న 10 గ్రాములకు రూ.63,920గా ఉన్న బంగారం ధరలు ప్రస్తుతం 41.5 శాతం పెరిగి రూ.90,450కి చేరుకుంది.