
జకాత్ దానం ద్వారా తమ సామాజిక వర్గ అభ్యున్నతికి సవాలక్ష అవకాశాలు ఉన్న, తెలుగు నాటతో సహా సమస్త భారత దేశంలోనూ అటువంటి కృషి జరుగుతున్న ఉద్దంతం ఒకటి కూడా లేకపోవడం విచారకరం. జకాత్ దానం ద్వారా విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టవచ్చు. ముస్లిం సమాజంలోని పేదలకు ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థ గాని,ఆసుపత్రి గాని,తెలుగు నాట ఒకటి కూడా లేదు.కనీసం నవాబుల నగరమైన హైదరాబాదులో విద్యా అవకాశాల కొరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే, ముస్లిం బాల బాలికలకు నీడనివ్వడానికి విద్యార్థుల వసతి గృహం ఒకటి కూడా లేదంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఇళ్లలో, మసీదులలో, జకాత్ ఇవ్వమని వచ్చే అసంఖ్యాకులలో ఏ ఒక్కరు కూడా ఒక పాఠశాల లేదా, వైద్యశాల నిర్మాణం, కోసం రాకపోవడానికి కారణం ఆ దిశగా సమాజం అడుగువేయకపోవడమే కాదూ.సామాజిక వికాస కార్యక్రమాలను జకాత్ ద్వారా చేయడం పెద్ద సమస్య ఏమి కాకున్నా ఎందుకు ముస్లిం సమాజం మినాంటి ఉండిపోతుంది. హైదరాబాద్ నగరంలోని ఒక టోలిచౌకి ప్రాంతానికి చెందిన ప్రవాసులు నిబద్దతగా జకాత్ ఇస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ముస్లిం సామాజికులకు ఈ దిశగా నేతృత్వం వహించే ఆమోదయోగ్యమైన నాయకుడు ఒక్కడు కూడా లేకుంటే ఆశ్చర్యము కలుగుతుంది.అటు కర్ణాటక సరిహద్దులోని హిందూపురం మొదలు, ఇటు మహారాష్ట్ర సరిహద్దులోని బోధన వరకు తెలుగు నాట ముస్లిం సమాజం దీనిపై ఆత్మ విమర్శ చేసుకోవాలి.తమ వెనుకబాటుతనానికి పాలకులే కారణం అంటూ నిందించటం వల్ల ప్రయోజనం ఏముంది. వివక్షకు గురవుతున్న బాధితులుగా చెప్పుకుంటూ వాపోవడం కంటే తమ పరిధిలో తమ ఎంతవరకు తమవారికి మేలు చేయగలుగుతామనే కనీస కిం కర్తవ్యాన్ని ముస్లిములు విస్మరిస్తున్నారు. ప్రార్థనలతో పాటు దానానికి కూడా ముందుకు వస్తేనే ఆధ్యాత్మికతకు పరిపూర్ణత ఉంటుందని నూర్ భాషా సంఘం నందికొట్కూరు మండల అధ్యక్షుడు డి.గోకరి సాహెబ్ తెలిపారు.ఈ నెలలో స్వర్గ ద్వారాలు పూర్తిగా తెరిచి ఉంటాయి నరక ద్వారాలు మూతపడతాయి వయసుతో నిమిత్తం లేకుండా విశ్వాసులు ఇంటిల్లిపాది రాత్రింబవులు ఆధ్యాత్మికత లో మునిగి తేలుతారు. దైవం పట్ల విశ్వాసాన్ని పటిష్టపరుచుకుంటారు. పుణ్య కార్యాల పట్ల ఆకాంక్షను పాపకర్యాల, పట్ల విముకుతను పెంచుకుంటారు. అల్లాహ్ తన బోధనామృతాన్ని ప్రజలకు అందజేసిన మాసం ఇది ఆయన తన అపార అనుగ్రహాన్ని వర్షిస్తాడు. ధనవంతులకు పేదల హక్కును గుర్తుచేసి జకాత్, పిత్రాలాంటి ధర్మాలను నిర్వర్తించడాన్ని విధిగా నిర్దేశించిన రంజాన్ నెల ఉపవాసాల ద్వారా ఆర్తుల ఆకలి దప్పులను సంపన్నులకు అనుభవపూర్వకంగా తెలియజేస్తుంది. దానధర్మాలకు సంబంధించిన కార్యాలు ముమ్మరమవుతాయి, సోదర భావం పరస్పరం బలపడుతుంది. శాంతియుత వాతావరణం లో విశ్వాసులు భక్తి ప్రవర్తులతో ప్రార్థనలు చేస్తారు. యంత్రాలు ఎడతెరిపి లేకుండా కొంతకాలం పని చేసిన తర్వాత వాటికి విశ్రాంతి కావాలి. వాటి భాగాలను ఊడదీసి శుభ్రం చేయాలి. అప్పుడే మలినాలన్నీ పోతాయి. మళ్లీ సమర్థమైన విధి నిర్వహణకు సిద్ధమవుతుంది. అలాగే మన జీర్ణ వ్యవస్థకు విశ్రాంతిని ఇచ్చి దానికి క్రమబద్ధతను చేకూర్చే ఆరాధన రోజా ఉపవాసం అని రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులందరికీ డి.గోకరిసాహెబ్ శుభాకాంక్షలు తెలియజేశారు.