
అమలాపురం
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో అమలాపురం టీడీపీ కార్యాలయం వద్ద ఘనంగా జరిగాయి. టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతలక్ష్మి, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణ బాబు ముఖ్యతిదులుగా పాల్గొని ఎమ్మెల్యే ఆనందరావు కలసి టీడీపీ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు..పేద బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాడినది స్వర్గీయ ఎన్టీ రామారావు అని ఆయన అడుగుజాడల్లోనే యువత పయనించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర్నుంచి మహిళలు అభివృద్ధికి కృషిచేసిన స్వర్గీయ ఎన్టీఆర్ అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఎనలేనిదని జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతలక్ష్మి అన్నారు. బిసి ఎస్సీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో పెద్దపీట వేసి రిజర్వేషన్ కల్పించిన ఘనత టిడిపి పార్టీకే దక్కుతుందని రమణబాబు అన్నారు.భారతదేశంలో మొట్టమొదటిగా పింఛన్లు కల్పించిన ఘనత టిడిపికే బాధ్యత దక్కుతుందని, ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించింది కూడా టిడిపి పార్టీ అని పెచ్చెట్టి విజయలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు టిడిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.