YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆపరేషన్ ఆకర్ష్ లో ఫుల్ జోష్

ఆపరేషన్ ఆకర్ష్ లో ఫుల్ జోష్

గుంటూరు, ఏప్రిల్ 1, 
ఉన్నది కూటమి ప్రభుత్వమే. కానీ హవా మొత్తం వైసీపీదే అక్కడ. ఎందుకలా జరుగుతోంది? కారణాలు ఏమై ఉంటాయి? అటు నుంచి ఇటు ఆపరేషన్ ఆకర్ష్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. కానీ ప్రత్యర్ధి పార్టీని కట్టడి చేయడంలో ఎందుకంత ఫెయిల్యూర్.కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదికి కాలానికి దగ్గర పడుతోంది. అనేక ప్రాంతాల్లో వీరు పట్టు సాధిస్తోన్న పరిస్థితులు కూడా ఉన్నాయ్. పల్నాడు జిల్లాలో దాదాపు అన్ని సెగ్మెంట్లలోనూ కూటమి పార్టీ లీడర్లు ఇటు పొలిటికల్ గా అటు ప్రభుత్వ పరంగా పట్టు సాధిస్తున్న పరిస్థితులు. అయితే ఈ జిల్లాలోని ముఖ్యమైన నరసరావు పేట, మాచర్ల ప్రాంతాల్లో మాత్రం అలాంటి సీన్ కనిపించడం లేదని అంటున్నారు.పల్నాడు జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో.. టీడీపీ లీడర్లు తమదైన స్టైల్లో పార్టీ కేడర్ ని పటిష్టం చేసుకునే యత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలను సైతం ఇటు వైపునకు ఆకర్షితులను చేయడంలో విజయం సాధిస్తున్నారు. అయితే నరసరావుపేటలో మాత్రం కూటమికి అనుకూల వాతావరణం ఏమంత గొప్పగా కనిపించడం లేదంటున్నారు. గత ఎన్నికల టైంలో టీడీపీ ఇక్కడ గెలిచినా.. ప్రస్తుత పరిస్థితులు మాత్రం వైసీపీకే అనుకూలంగా కనిపిస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో వైసీపీకంటే కూటమి పార్టీలే పటిష్టంగా ఉంటే.. ఒక్క నరసరావు పేటలోనే ఇలా ఎందుకు జరుగుతోంది? అన్న చర్చ నడుస్తోందిక్కడ. కూటమి పార్టీల అంతర్గత వర్గాల్లోనూ ఈ చర్చ జోరుగానే సాగుతోందట.నరసరావుపేట విషయంలో టీడీపీ అధిష్టానం ఇప్పటికే పలుమార్లు స్థానిక నేతలను పిలిపించి మాట్లాడిందట. అంతే కాదు పార్టీ పటిష్టత వ్యవహారంలో గట్టి చర్యలు చేపట్టాలనే కోరారట. అయితే నానాటికీ కూటమి పార్టీల్లో ఐక్యత తగ్గుముఖం పడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో పార్టీలో తమ భవితవ్యం ఏంటో అర్ధం కావడం లేదని వాపోతున్నారట స్థానిక తెలుగు తమ్ముళ్లు. ఇందుకు కారణం ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న అరవింద్ బాబు తీరేనంటున్నారు. ఈయన ఇతర నేతలను కలుపుకుపోవడంలో పూర్తిగా వెనకడుగు వేస్తున్నారనీ వాపోతున్నారు కార్యకర్తలు. తానేంటో, తన వర్గం నేతలేంటో.. అన్నట్టుగా ఈయన ధోరణి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక టీడీపీ లీడర్లు.పైకేమో మనమంతా ఒక్కటేనంటారట. అదే లోలోన మాత్రం.. సామాజిక వర్గాల వారీగా భారీ ఎత్తున విబేధాలు నడుస్తున్నాయట. దీంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఇక్కడ వ్యవహారం సాగుతోందని చెబుతున్నారు. దీంతో ఏదైనా కార్యక్రమం జరిగితే.. కూటమినేతలు కలసికట్టుగా హాజరైన దాఖాలేలేవు. దీన్నీబట్టీ ఇక్కడ వీరి మధ్య ఎంత ఐక్యత ఉందో ఊహించుకోవచ్చంటున్నారు కార్యకర్తలు.నరసరావుపేట ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఇటీవలి ఎంపీపీ ఎన్నికలే.. ఒక ఉదాహరణగా చెబుతున్నారు విశ్లేషకులు. పార్టీ సంగతి అటుంచి తన వర్గాన్ని కాపాడుకోవడంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజయవంతం అవుతున్నారీనీ అంటున్నారు. వైసీపీ నిర్వహించిన ఫీజు పోరులో గోపిరెడ్డి స్థానిక విద్యార్ధులను మొబిలైజ్ చేయడంలో గొప్పగానే సక్సెస్ సాధించారన్న మాట వినిపిస్తోంది.క్యాంపు రాజకీయాలే కావచ్చు, మరేదైనా కార్యక్రమాలు కావచ్చు.. నిజయోజవర్గంలోని ఇతర వైసీపీ నేతలను ఆకర్షించడంలో కూటమి లీడర్లు సక్సెస్ అవుతున్నారు. కానీ, నరసరావుపేట- ఎంపీపీ ఎలెక్షన్ల వ్యవహారం చూస్తే అక్కడెలాంటి పరిస్థితి ఉందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు. ఎమ్మెల్యే ఎంత చొరవ చూపినా ఆయనకు సహకరించడానికి ఇక్కడ కూటమి లీడర్లు.. సిద్ధంగా లేనట్టు సమాచారం. పార్టీ ఒకటే కానీ, వర్గాలు మాత్రం రెండు మూడుగా ఉన్నట్టు తెలుస్తోంది. దానికి తోడు కూటమిలో వివిధ పక్షాలు ఒకే వేదికపై రావడానికి ఇష్టత చూపక పోవడంతో.. వైసీపీ తన హవా కంటిన్యూ చేస్తోందట.ఇక మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ఫలితాల వరకూ పటిష్టంగానే కనిపించారు. కానీ, రిజల్ట్స్ తర్వాత ఆయన పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదని సమాచారం. ఇందుకుగల కారణాలేంటని ఎవరికి వారు విశ్లేషించుకుంటున్నారట.రాజకీయంగా, ప్రభుత్వ పరంగా ఇతర ప్రాంతాల్లో కూటమి పటిష్టత ఎలాగున్నా మాచర్లలో మాత్రం తీవ్ర నిరాశాజనకంగా ఉన్నట్టు తెలుస్తోంది. సొంత పార్టీ కార్యకర్తలే తీవ్ర నిరాశా నిస్పృహలు కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మెజార్టీ తీసుకురావడంలో.. మార్చర్ల నియోజకవర్గం మంచిగానే సక్సెస్ సాధించింది. కానీ, స్థానిక రాజకీయ స్థితిగతుల్లో పట్టు సాధించడంలో మాత్రం ఇంకా వెనకంజలోనే ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.ప్రస్తుత పరిస్థితులను ఎలా కంట్రోల్ చేస్తారు? ప్రత్యర్ధి వర్గానికి చెందిన నేతలను ఎలా కట్టడి చేస్తారు? అన్నదిక్కడ ప్రశ్నార్ధకంగానే ఉందట. అసలే కూటమి అంటే ఏక పార్టీ కాక పోవడం. టీడీపీలోనూ రకరకాల వర్గాలుగా తయారు కావడంతో.. సమస్య జటిలంగానే ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.ఏదండీ ఆ పల్నాటి పౌరుషం? అంటూ కూటమి పార్టీల కార్యకర్తలు.. తమ పై స్థాయి నాయకులను నిలదీస్తున్నారట. వైసీపీకంత సీన్ ఇవ్వకుండా ముందుకెళ్లాలంటే వీరిలో వీరికి మొదట ఐకమత్యం అలవడాలనీ కామెంట్ చేస్తున్నారట. అలా జరిగితేనే ఇక్కడ కూటమి భవిష్యత్ బలపడుతుందని అంచనా వేస్తున్నారు. మరి చూడాలి.. ఈ ప్రాంత కూటమి నేతల్లో ఎలాంటి మార్పు వస్తుందో.. చూడాలంటున్నారు కూటమి పార్టీల కార్యకర్తలు.

Related Posts